Minister Harish Rao Gives Some Key Orders To Health Officials In Board Meeting: మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో మంత్రి హరీశ్ రావు అధ్వర్యంలో బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ విశాలాచ్చి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీఎంఈ రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జీ శ్రీనివాస్ రావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ పరిమితి 2 నుండి 5 లక్షలకు పెంచిన దృష్ట్యా.. కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించి, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్ధిదారులకు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం లబ్ధిదారుల eKYC ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
Google Security: మీ గూగుల్ అకౌంట్ హ్యాక్ అయిందా..? ఇలా చెక్ చేసుకోండి..!
నిమ్స్ స్పెషలిస్ట్ డాక్టర్‌ల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్ ఆడిట్ నిర్వహణ చేయాలని.. కోవిడ్ సమయంలో రికార్డు స్థాయిలో 856 బ్లాక్ ఫంగస్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించిన కోఠి ఈఎన్టీ ఆసుపత్రికి ఒక కోటి 30 లక్షల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. మూగ, చెవిటి పిల్లలకు చికిత్స అందించి బాగు చేసే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు ప్రస్తుతం కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఈ తరహా సేవలను MGM వరంగల్‌లో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 3 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండగా.. తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ సంఖ్యను 103కు చేర్చింది. ఎక్కువ ఖర్చులు వెచ్చించి, దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. నియోజకవర్గం పరిధిలోనే డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇవి కిడ్నీ బాధితులకు వరంగా మారాయి.
Maamannan: తెలుగులో రిలీజయ్యి వారం కూడా కాలేదు.. అప్పుడే ఓటీటీలోకి!
మరింత నాణ్యంగా డయాలిసిస్ సేవలు అందించేందుకు గాను ఆన్లైన్ పర్యవేక్షణ చేసే విధంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి, వినియోగించడానికి.. బోర్డు అనుమతి ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఆరోగ్యశ్రీ రోగులకు ఫేస్ రెకగ్నిషన్ సాఫ్ట్‌వేర్ వినియోగానికి అనుమతి ఇచ్చేలా ఈ మీటింగ్‌లో నిర్ణయించారు. బయోమెట్రిక్ విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో.. మరింత పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించేందుకు ఈ విధానం తేవాలని నిర్ణయించింది.