సిద్ధిపేట జిల్లా ప్రజలకు రైలు ఎక్కాలనే కల ఎట్టకేలకు తీరబోతోంది. త్వరలోనే సిద్దిపేటకి రైలు జర్నీ ఆరంభం కానున్నాయి. ఈ క్రమంలో నర్సాపూర్ స్టేషన్ వరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ట్రయల్ రన్ నిర్వచించారు. ఇక, సిద్దిపేటలో రైలు కూతపై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. ట్రైన్ ముందు నిలబడి సెల్ఫీ దిగి తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారాయన.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరో ముందడుగు వేసింది. ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతో వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
మెదక్ జిల్లా కావాలి అనేది దశాబ్దాల కల అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇందిరా గాంధీ మాట ఇచ్చి తప్పారు.. కేసీఆర్ జిల్లా చేసి చూపించారు అని ఆయన తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి తిట్ల పురాణం.. మీరు తిట్లలో పోటీ పడితే మేం పంట పండించే పనిలో బిజీగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
Malkajigiri BRS: మంత్రి హరీశ్ రావుపై విమర్శలు చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై బీఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్ అయింది. ఇప్పటికే ఆయనకు పార్టీ టికెట్ కేటాయించగా.. అభ్యర్థి మార్పు ఉంటుందనే ప్రచారం సాగుతోంది.
రాష్ట్రంలో ఎవరెన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ దే అని మంత్రి హరీష్ రావు అన్నారు. గత ఎన్నికల్లో కంటే ఎక్కువగా సీట్లు గెలుస్తాం.. కుర్చీ కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కొట్టుకుంటున్నాయి.. ప్రతి పక్షాలది తిట్లలో పోటీ.. బీఆర్ఎస్ కి దేశంలో తెలంగాణని నంబర్ వన్ స్థానంలో నిలపడంలో పోటీ.. ఈ నెల23న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించబోతున్నారు అని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నూతనంగా నిర్మించిన సామాజిక అరోగ్య కేంద్రాన్ని మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రవిచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సబితక్క మనసు నిండా తెలంగాణ వాదం.. ఉద్యమం సమయంలో హోం మంత్రిగా ఉండి ఎంతో సాయం చేశారు.
IT Tower Website: సిద్దిపేటలోని ఐటీ హబ్ లో ఐటీ టవర్ వెబ్ సైట్ ను ఆర్థిక శాఖామంత్రి హరీష్ రావు ప్రారంభించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా.. సిద్దిపేట డిగ్రీ కాలేజీలో జాతీయ జండాను హరీష్ రావు ఆవిష్కరించారు.
తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు రైతుల రూ.99,999 రుణాన్ని సీఎం కేసీఆర్ మాఫీ చేసినందుకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం ఎన్ని ఆర్థిక అవరోధాలు సృష్టించినా.. రైతు సంక్షేమం విషయంలో తెలంగాణ సర్కార్ ఎక్కడా రాజీపడలేదన్నారు.