Harish Rao: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం లో మాజీ రాజ్యసభ సభ్యుడు వొడితేల రాజేశ్వర్ రావు విగ్రహాన్ని ఆర్థిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. అనంతం హరీష్ రావు మాట్లాడుతూ.. రాజేశ్వర్ రావు విగ్రహం ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. 2001 తరువాత నాకు రాజేశ్వర్ రావుతో సానిహిత్యం పెరిగిందని అన్నారు. రాజేశ్వర్ రావు బ్రతికి ఉంటే ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని చూసి సంతోషపడేవారని తెలిపారు. రాజేశ్వర్ రావు వ్రాసే సాహిత్యాలు,వ్యాసాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి చాలా దోహదపడ్డాయని అన్నారు. గల్లీ నుండి ఢిల్లీ దాకా ఎదిగిన వ్యక్తి రాజేశ్వర్ రావు, ఉరి పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న మహనీయుడు అని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కృషి చేసిన వ్యక్తి రాజేశ్వర్ రావు అని తెలిపారు. ఆ రోజుల్లో నక్సలైట్లు అంటే భయపడేవారు రాజకీయ నాయకులు కానీ నక్సలైట్లు కూడా ఇష్టపడే వ్యక్తి రాజేశ్వర్ రావు అని అన్నారు. ఆ కుటుంబం నుండి నేను కూడా చాలా నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నారు. రాజకీయంగా ఎంత ఎదిగిన తన స్వగ్రామం మాత్రం మర్చిపోనీ వ్యక్తి రాజేశ్వర్ రావు అని మంత్రి హరీష్ రావు అన్నారు.
Read also: Hollywood: రెండు వారాల్లో మూడు హిట్స్… థియేటర్స్ కళకళలాడుతున్నాయి
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. చెత్త వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నడక, చెత్త సేకరణ ద్వారా ఆరోగ్యంతో స్వచ్ఛ్ టౌన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఇందులో భాగంగా ‘మా చెత్త మనదే’ అంటూ సిద్దిపేటలో ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 18వ వార్డులో నడుచుకుంటూ వెళ్తూ మురికి కాల్వలో పేరుకుపోయిన పేపర్లు, కవర్లను స్వయంగా తొలగించారు. చెత్తాచెదారం పేరుకుపోవడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటుందని అంటున్నారు. ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిన్న ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా కోకాపేటలోని తన నివాసం పరిసరాలను శుభ్రం చేసిన సంగతి తెలిసిందే. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన కుటుంబం, సమాజం సాధ్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు. వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా లేకున్నా నీరు చేరి దోమలు వ్యాపించే అవకాశం ఉందన్నారు. దోమల వల్ల వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు దూరంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ దోమల నివారణకు కృషి చేయాలని సూచించారు.
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్