వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలకు మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు. బీజేపీ కర్ణాటకలో కుక్క చావు చచ్చింది.. నడ్డా మర్యాదగా మాట్లాడి ఉంటే బాగుంటుంది.. అడ్డంగా ఉన్న నడ్డా చాలా మాట్లాడారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao: పుట్టుక నుండి చావు దాకా ప్రజలకు ఏం కావాలో ఆలోచించింది సీఎం కేసీఆర్ అని ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. KPHB డివిజన్ 5 వ ఫేస్ లోధ టవర్స్ సమీపంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోఆరెకటిక సంఘం నూతన భవనానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ ఆసుత్రుల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 9 ఏళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది.
Bhatti vikramarka: 2016లో నీళ్లు ఇస్తామని చెప్పిన మంత్రి హరీష్ రావు 2023 లో కూడా అదే మాట చెప్పడం విడ్డూరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సెటైర్ వేశారు.
Bhatti vikramarka: బిఆర్ఎస్ పాలనకు ఉన్నదీ ఇక రెండు నెలల సమయమే ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. భట్టి విక్రమార్క పాదయాత్ర 78వ రోజు మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బలమూరు మండలం అనంతవరం గ్రామానికి చేరుకున్న సందర్భంగా భాజా భజంత్రీలు కొమ్ము బూరలు, డప్పులతో ఘనంగా స్వాగతం పలికారు.
Harish Rao: సీఎం కేసీఆర్ దీక్షాదక్షతలో మన రాష్ట్రం ముందడుగు వేస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. . మన సిద్దిపేట జిల్లా సైతం ఎన్నో కీర్తికిరీటాలను సొంతం చేసుకుందని తెలిపారు. సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.