తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ప్రాజెక్ట్ అన్ని జిల్లాలకు మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తుంది. ఇప్పటికే పలు జిల్లాలో నిర్మించిన మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అయితే, తాజాగా రాష్ట్రంలో మరో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో కాలేజీలకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Triumph Bikes: భారత్‌లో విడుదలైన బజాజ్ ట్రయంఫ్ బైక్స్.. ధరెంతో తెలుసా?
సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ లక్ష్యం సాకారమవుతుందని వైద్యారోగ్యమంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించబోతుందని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే అరుదైన రికార్డును తెలంగాణ రాష్ట్రం సొంతం చేసుకుంటుంది. 9 ఏండ్ల కాలంలో 29 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు.. రాష్ట్రంలో పది వేలకు పైగా ఎంబీబీఎస్ సీట్లు చేరువ కానున్నాయి.
Read Also: Niharika Konidela: ఎవడేమన్నా నాకు దాంతో సమానం.. నిహారిక వీడియో వైరల్
మారుమూల ప్రాంతాలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువైవుతున్నట్లు మంత్రి హరీశ్ రావు అన్నారు. స్థానికంగా ఉంటూనే ఎంబీబీఎస్ చదివేందుకు అవకాశాలు పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలను మంత్రి హరీశ్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వైద్య విద్య విప్లవమిది అని ఆరోగ్యశాఖ మంత్రి వాఖ్యనించారు. ప్రతి పేదబిడ్డ కూడా ఎంబీబీఎస్ చదివే విధంగా ఈ కాలేజీలు జిల్లాకు ఒక్కటి నిర్మిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణలో మెరుగైన వైద్య సేవలను అందించేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన అద్భుతమైన ఆలోచన ఈ మెడికల్ కాలేజీలు అని ఆయన అన్నారు.