టీచింగ్ ఆసుపత్రుల్లో 190 అసిస్టంట్ ప్రొఫెసర్ పోస్టులను అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలి అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కౌన్సిలింగ్ పూర్తి చేసి వెంటనే పోస్టింగ్ లు ఇవ్వాలి అని ఆయన పేర్కొన్నారు. ప్రొఫెసర్ నుంచి అడిషనల్ డీఎంఈగా పదోన్నతి పొందేందుకు వీలుగా వయోపరిమితి 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లకు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నాడు. అడిషనల్ డీఎంఈ పదోన్నతి ప్రక్రియ వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులకు మంత్రి హరీశ్ రావు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Manchu Manoj: తాండూరు ఎమ్మెల్యే అతిరుద్ర మహాయాగంలో మెరిసిన మంచు మనోజ్ దంపతులు
ప్రొఫెసర్ల బదిలీల విషయంలో ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డికి మంత్రి హరీశ్ రావు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ లోని మొత్తం 112 డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ సర్జన్ పదోన్నతుల ప్రక్రియ వెంటనే చేపట్టాలి, 15 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆయన తెలిపారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ లోని 371 నర్స్ ప్రమోషన్ల ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. వచ్చే 10 రోజుల్లో లోకలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి, నెల రోజుల్లో ప్రమోషన్స్ ప్రక్రియ కంప్లీట్ కావాలని తెలిపారు.
Read Also: Delhi Floods: యమునా నది మహోగ్ర రూపం.. వెంటనే లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాలని సీఎం వార్నింగ్..
ఇదే విధంగా ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రఫర్స్ కు సంబంధించిన పదోన్నతుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. డెంగ్యూ పరీక్ష నిర్ధారణ కోసం ఉపయోగించే 32 సింగిల్ డోనార్ ప్లేట్ లెట్స్ మిషన్లను రూ. 10 కోట్లతో వెంటనే కొనుగోలు చేసి, అన్ని జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. వీటి ఏర్పాటు వల్ల సకాలంలో రోగనిర్ధారణ జరిగి సత్వరమే చికత్స అందించడం జరుగుతుందన్నారు.
Read Also: AP Cabinet Decisions: వారందరికీ శుభవార్త చెప్పిన కేబినెట్..
పీఎంపీ, ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చే విషయంపై వైద్యాధికారులతో మంత్రి హరీశ్ రావు అదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాలకు లోబడి వారికి శిక్షణ ఇచ్చే అంశంపై పూర్తి నివేదిక రూపొందించేలా కమిటీ ఏర్పాటు చేయాలని హరీశ్ రావు పేర్కొన్నారు. వారం రోజుల్లో అధికారులు నివేదిక అందించాలని తెలిపారు.
Read Also: Online Marriage: అనుకోని పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో పెళ్లి..
ఈ ఏడాది ప్రారంభించే మెడికల్ కాలేజీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ సారించాలని, ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు ఆదేశాలను జారీ చేసారు. నిమ్స్ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన పనులు వేగవంతం చేయాలన్నారు. కొత్తగా సమకూర్చుకున్న 228 అమ్మఒడి వాహనాలు, (204) 108 వాహనాలు, 34 హర్సే వాహనాలను ఆగస్టు 1 వ తేదీన ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.