హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయం హీట్ ఎక్కుతోంది. మంగళవారం హుజురాబాద్ లో ఈటలకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన మాజీ ఎంపీ వివేక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్, హరీష్ రావు ల స్నేహం మధ్య చిచ్చు పెట్టింది కేటీఆర్ అని, ఓటమి భయంతో ఏదో ఒకటి చెప్పాలని కేటీఆర్ చెప్తున్నారన్నారు. సుమన్ భాష మార్చుకోవాలి మొనగాడు ఎవరో సీఎం కేసీఆర్ ను అడిగితే చెప్తాడన్నారు. మేము కాంగ్రెస్ లో ఎందుకు పోతం బీజేపీ బలోపేతానికి…
ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరిన తరువాత అబద్ధాల ను ఒంటపట్టించుకున్నాడు అని మంత్రి హరీష్ రావు అన్నారు. తాజాగా హుజురాబాద్ లో మాట్లాడిన ఆయన… ఈ మధ్య ఏమీటింగ్ లకు పోయిన కరెంట్ కట్ చేస్తున్నారని,మమ్మల్ని వేధిస్తున్నారంటూ టిఆర్ఎస్ పార్టీ మీద దుష్ప్రశారం చేస్తున్నారు. అబద్ధాలతో బురదజల్లి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కమలపూర్ లో బాల్క సుమన్ కారు ప్రమాదంలో ఆటో డ్రైవర్ చనిపోయాదంటూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి రహదారిపై బైటాయించుండు ఈటల రాజేందర్…
మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి హరీష్‌రావు.. జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో గెల్లు శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇళ్లు ఎలా వస్తాయి? గెల్లు శీను గెలిస్తే వస్తాయా..? ఈటల గెలిస్తే వస్తాయా? ఒక్కసారి ఆలోచించాలన్నారు.. గెల్లు సీను గెలవడం ఖాయం ఇక్కడ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామన్న ఆయన.. గొంతు బిగ్గరగా చేసుకొని పెద్దగా మాట్లాడిన జూట మాటలు మాట్లాడిన ధర్మం…
ఈ రోజు బెంగాల్ ల్లో మమత గెలిచింది. రేపు మత తత్వ బీజేపీ కి హుజురాబాద్ లో స్థానం లేదని చెప్పాలి అని మంత్రి హరీష్ రావు అన్నారు. లెఫ్ట్ అన్న ఈటల రాజేందర్ రైటీస్ట్ గా ఎలా బీజేపీలో చేరారు… నల్లా చట్టాలు అని చెప్పిన ఈటల రాజేందర్ ఆ పార్టీలో ఎలా చేరారు అని ప్రశ్నించిన ఆయన స్వార్థం కోసం బీజేపీలో చేరారు ఈటల రాజేందర్ అని తెలిపారు. ఇక తెలంగాణ పట్ల బీజేపీ…
ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసిండు అంటే ఆస్తులు కాపాడుకోడానికి అని మంత్రి హరీష్ రావు అన్నారు. తాజాగా కమలాపూర్ మండలంలో ఆయన మాట్లాడుతూ… తెరాస పార్టీకి ఓటేస్తే న్యాయం జరుగుతుందా, బీజేపీ పార్టీకి ఓటేస్తే న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ రైతులకు అన్యాయం చేస్తుంది.బావుల కాడా మోటర్లకు మీటర్ల పెట్టమంటుంది,మార్కెట్ వ్యవస్థ రద్దు చేస్తా అంటుంది. కేసీఆర్ కుడి చేత్తో ఇస్తే,ఎడమ చేత్తో బీజేపీ గుంజుకుంటుంది. ఈనాడు ఈటల రాజేందర్ రైతుల ఉసురు…
సీఎం కేసీఆర్ ధర్మంతో గోక్కున్నారు.. మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరించారు మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. జమ్మికుంట మండలం నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను మధ్యలో వచ్చి మధ్యలో పోయానట.. ఎలానో చెప్పు మిత్రమా హరీష్ రావు అంటూ ప్రశ్నించారు.. పచ్చ కామెర్లవారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టు నేనే నామీద దాడి చేయించుకుని కట్టుకట్టుకొని వస్తా అని చెప్తున్నారు.. అలా చేసేది మీరే అని…
హుజురాబాద్ నియోజక వర్గం లో ఒక్క మహిళ భవనం ఒక్క డబుల్ బెడ్ కట్టలేదు. కానీ ధరలు పెంచిన ఆ బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని అడిగారు మంత్రి హరీష్ రావు. హుజూరాబాద్ కు వచ్చి అభివృద్ది పనులతో పాటు కమ్యూనిటీ హల్ లు ఇచ్చిన. హుజూరాబాద్ లో పార్టీ కార్యకర్తగా రాష్ట్ర మంత్రిగా పని చేస్తున్న. ఈటల రాజేందర్ ప్రలోభాలకు గురి చేస్తే తప్పు లేదు కానీ నేను హుజూరాబాద్ లో అభివృద్ది చేస్తే తప్ప…
హుజురాబాద్ లో రజక ఆత్మీయ సమ్మేళనములో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ఈ రోజు మనందరం గర్వపడే రోజు ఈ రోజు చాకలి ఐలమ్మ పుట్టిన రోజు. గత ప్రభుత్వాలు చాకలి ఐలమ్మ జయంతి నీ అధికారికంగా జరపమంటే ఎవరు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ చాకలి ఐలమ్మ జయంతి నీ అధికారికంగా నిర్వహిస్తున్నారు. 250 కోట్ల తో రజకుల కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టి రజకుల ఇస్త్రీ చేసుకునే వారికి 250 యూనిట్లు ఉచితం గా ఇస్తున్న…
దళిత బంధు పై కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని అర్హులైన దళిత కుటుంబాలందరికి అమలు చేస్తాము. వివాహం అయిన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం డబ్బులు జమ అవుతాయని, ఎవ్వరూ కూడా ఆందోళన చెందవద్దు. దళిత బంధు డబ్బులతో స్వయం ఉపాధి కోసం…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పొరపాటున బీజేపీ గెలిస్తే పదేళ్ల అభివృద్ధి వెనక్కి పోతుందన్నారు మంత్రి హరీష్‌రావు.. కరీంనగర్ జిల్లా వీణవంకలో మంత్రి హరీష్ రావు సమక్షంలో పలువురు నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం అన్నారు.. ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ గెలిస్తే పది సంవత్సరాలు అభివృద్ధి ముందుకెళ్తుంది.. పొరపాటున బీజేపీ గెలిస్తే 10 సంవత్సరాలు అభివృద్ధి వెనక్కి వెళ్తుందన్నారు.. వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా.. హుజురాబాద్…