కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోయింది.. ఇప్పట్లో థర్డ్ వేవ్ ముప్పుకూడా పెద్దగా ఉండకపోవచ్చు అనే అంచనాలు వేశారు.. కానీ, కోవిడ్ కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు గుబులు పుట్టిస్తోంది.. పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ బి.1.1.529 కేసులు వెలుగుచూస్తున్నాయి.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది.. అప్రమత్తమైన బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, చెక్ రిపబ్లిక్, ఇజ్రాయెల్, సింగపూర్లు సదరన్ఆఫ్రికా దేశాలపై ట్రావెల్బ్యాన్విధించాయి. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం…
కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అన్ని రాష్ట్రాలు ఇప్పుడు వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెట్టాయి.. ఇక, తెలంగాణలో డిసెంబర్ వరకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి మొదటి డోస్, రెండో డోస్ ఎంత మంది తీసుకున్నారనే వివరాలు పక్కా సేకరించాలని చెప్పారు. ఆశాలు, ఏఎన్‌ఎంలు, వైద్యులు గ్రామస్థాయి, సబ్‌సెంటర్…
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కిడ్నీ వాధితో బాధపడుతున్న వారికి ఉచితంగా డయాలసిస్ సేవలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. ఈ రెండు ప్రాంతాల్లో తక్షణమే డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా కేంద్రాల్లో ఎయిడ్స్ రోగులకు 5, హెపటైటిస్ రోగుల కోసం మరో 5 పడకలను కేటాయించాలన్నారు. Read Also: తెలంగాణ…
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాము బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. వరి ధాన్యం మాత్రం కొంటామని.. అయితే ఎప్పుడు కొంటాం.. ఎంత కొంటామో తరువాత చెప్తామని కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పంజాబ్ నుంచి వరి ధాన్యం కొంటున్నట్టుగా తెలంగాణ నుంచి ఎందుకు కొనుగోలు చేయడంలేదని మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. పంజాబ్ కు ఒక…
యాసంగి పంట కొంటారా…కొనరా… సీదా అడుగుతున్నాం అని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండేది దొడ్డు వడ్లు. కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగడుదాం. పంజాబ్ రాష్ట్రానికి ఒక నీతి.. తెలంగాణ రాష్ట్రానికి ఒక నీతా అని అడిగారు. రైతు చట్టాలు రద్దు రైతుల విజయం..రైతుల పోరాటం తో కేంద్రం దిగొచ్చింది. తెలంగాణ రైతుల సంక్షేమ ప్రభుత్వం టీఆర్ఎస్. రైతుల పక్షాన స్వయంగా సీఎం కేసీఆర్ ధర్నా లో చేపట్టారు. రైతులు ఆందోళనల…
భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం ఏడోరోజుకు చేరింది. ఏడోరోజు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి హరీష్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు ప్రత్యేకంగా ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి హరీష్ రావు భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత రోజుల్లో మనుషులపై పని ఒత్తిడి పెరిగిపోవడంతో ఒక్క క్షణం కూడా తీరిక దొరకడం లేదు. దీంతో ప్రతి ఒక్కరూ ఏదో తెలియని మానసిక ఆందోళనతో బాధపడుతున్నారు.…
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి లిఫ్ట్ కూలింది. ఆ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్ రావు, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌లు హజరయ్యారు. అయితే ప్రమాద సమయంలో నేతలేవరు లిఫ్ట్‌లో లేరు. కానీ.. లిఫ్ట్‌లో ప్రయాణిస్తున్న కొంతమంతి గాయాలయ్యాయి. లోడ్ ఎక్కువ కావడంతో లిఫ్ట్ కూలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
ఎయిమ్స్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరో మారు తప్పుడు ప్రచారం అని రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాస్తవాలు వక్రీకరించి మాట్లాడుతున్నారు. మొన్ననేమో ఎయిమ్స్ కి భూమి ఇవ్వలేదని ఆరోపణ చేశారు. సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్ చూపించాం. ఇప్పుడేమో బిల్డంగ్ డాక్యుమెంట్స్, ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్స్ అంటున్నారు. రోజుకో తీరుగా మాట్లాడుతున్నారు. ఎయిమ్స్ విషయంలో ఈ ఏడాది అక్టోబర్9 న రాష్ట్ర ప్రభుత్వ…
ధాన్యం కొనుగోలుపై తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణులు ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేటలో టీఆర్‌ఎస్ నేతలు నిర్వహించిన ధర్నాలో మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వైఖరి తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. అప్పుడు తెలంగాణ కోసం ఉద్యమిస్తే.. ఇప్పుడు రైతుల కోసం ఉద్యమించాల్సి వస్తోందన్నారు. జై కిసాన్ నినాదాన్ని.. నై కిసాన్ గా కేంద్ర ప్రభుత్వం మార్చిందన్నారు. రా రైస్ అంటూ బీజేపీ నేతలు తేలివిగా మాట్లాడుతున్నారని..…
తెలంగాణలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కొట్లాట నడుస్తోంది. అటు ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వరి వేస్తే ఊరే అని వ్యాఖ్యానించి తెలంగాణ రైతులకు షాక్ ఇచ్చారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని చెబుతోందని…అందుకే ధాన్యం కొనుగోలు చేయలేమని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలేమో రైతులు ధాన్యాన్ని పండించండి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ నేతలు…