దళిత బంధు పై కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని అర్హులైన దళిత కుటుంబాలందరికి అమలు చేస్తాము. వివాహం అయిన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం డబ్బులు జమ అవుతాయని, ఎవ్వరూ కూడా ఆందోళన చెందవద్దు. దళిత బంధు డబ్బులతో స్వయం ఉపాధి కోసం ఎంపిక చేసుకున్న యూనిట్లు స్థాపించుకోవాలి. దళిత బంధు పథకం క్రింద వచ్చే రూ.10 లక్షలతో ఒక్కరూ 4 యూనిట్లు కూడా స్థాపించుకొవచ్చు అని తెలిపారు.
దళిత బంధు ఖాతాలు తెరిచేటప్పుడు తప్పిదాలు జరుగకుండా చూసుకోవాలని బ్యాంకర్లను ఆదేశము. ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, 65 ఏళ్ల లోపు వయస్సు ఉన్న దళితులందరికి దళిత బంధు డబ్బులు అందుతాయి. హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంకా డబ్బులు అందని దళిత కుటుంబాలందరికి మూడు రోజులలోపు వారి ఖాతాలో డబ్బులు జమ చేయాలని మంత్రి కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు. ఖాతాలలో పడ్డ డబ్బులను ప్రభుత్వం వెనుకకు తీసుకోదని, ఆ డబ్బులతో స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించుకోవాలి. యూనిట్లు స్థాపించుకునెంతవరకు ఖాతాలో నిల్వ ఉండే డబ్బులకు బ్యాంకులు వడ్డీ ఇస్తారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని బ్యాంకులలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలి. దళిత బంధు పథకం డబ్బుల గురించి అడిగే లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, డబ్బులు అకౌంట్లలో జమ అయిన లబ్ధిదారులు అందరికీ రెండు రోజుల్లోగా మెసేజ్ లు పంపాలని, బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేసారు.