కేసీఆర్ రా.. దమ్ముంటే నాపై పోటీ చేయి.. హరీష్‌రావు రా.. ధైర్యం ఉంటే నాపై పోటీ చేయాలి అంటూ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ విసిరిన సవాల్‌కు కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్‌రావు.. తాజాగా హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే కాగా.. హుజూరాబాద్ లో స్వాగతం చూస్తే గెల్లు శ్రీనివాస్ భారీ మెజార్టీతో గెలువబోతున్నాడని అర్థమవుతోందన్నారు.. ఎన్నికలు వచ్చినప్పుడు గెలిస్తే ఏం చేయాలో చెప్పాలి.. కానీ, బీజేపీ…
హుజూరాబాద్ లో ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల సందడి నెలకొంది.. ఓవైపు అధికార టి ఆర్ యస్ పార్టీ ఒకడుగు ముందుకేసి నియోజకవర్గ వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో క్యాడర్ దించి హడావుడి చేస్తోంది. ఇప్పుడు మంత్రి హరీష్ రావు కూడా పూర్తిస్థాయిలో నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పార్టీ నేతలతో సమావేశమై హుజురాబాద్ ఎన్నికపై చర్చించనున్నారు. తమ పార్టీ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రకటించే అవకాశం…
పిఆర్సీ అమలు చేసిన సందర్భంగా సిద్దిపేటలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వంకు కృతజ్ఞత సభ ఏర్పాటు చేసారు. దీనికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇంటింటికి నీళ్లు ఇచ్చే విషయంలో కేంద్ర మంత్రి షెకావత్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. వారు బీజేపీ అయినా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు అంటే పని చేస్తేనే ప్రశంసిస్తారు అనే మాట గుర్తుంచుకోవాలి. దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయం లో తెలంగాణ…
ఇంటింటికి నీళ్లు ఇచ్చే విషయంలో కేంద్ర మంత్రి షెకావత్.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు.. వారు బీజేపీ అయినా.. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.. అంటే పని చేస్తేనే ప్రశంసిస్తారు అనే మాట, గుర్తుంచుకోవాలని.. రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు… పీఆర్సీ అమలు చేసిన సందర్భంగా సిద్దిపేటలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఏర్పాటు చేసిన సభకు హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో…
ఉప ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ రాకముందే.. హుజురాబాద్‌లో పొలిటికల్ హీట్ మాత్రం పెరుగుతూనే ఉంది… అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరి పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన మాజీ మంత్రి, బీజేపీ నేతల ఈటల రాజేందర్.. మళ్లీ ట్రాక్‌లో వచ్చారు.. ఇవాళ.. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు… ఉరుములు వచ్చినా, పిడుగులు పడ్డా.. నా గెలుపును ఎవ్వరూ ఆపలేరనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన.. వస్తవా.. రా..! హరీష్‌రావు ఇక్కడ పోటీ చేద్దాం.. వస్తావా..? రా..…
రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం… ఇప్పటికే రూ. 50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆదివారం కేబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ మొత్తం ఈ నెల 16వ తేదీ నుంచి లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో జమకానుంది… రాష్ట్రంలోని ఆరు లక్షల మంది రైతు ఖాతాల్లోకి రూ.2006 కోట్ల రుణ మాఫీ డబ్బులు జమ చేయనున్నారు… బ్యాంకర్లు రుణ మాఫీ…
ఈటల రాజేందర్ కాలు ఆపరేషన్ పై దిగజారి మాట్లాడటాన్ని హరీష్ రావు విజ్ఞతకే వదిలేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. డ్రామాలకు పర్యాయ పదం కేసీఆర్ కుటుంబం.. సినీ నటుల కంటే గొప్పనటులు కేసీఆర్, హరీష్ రావులని ఆయన విమర్శలు చేశారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ.. ఎమ్మెల్సీ పదవికి కూడా అర్హహురాలు కాదా? ఉద్యమంలో పాడి కౌషిక్ రెడ్డిది కీలకపాత్రగా కేసీఆర్ భావించినట్లున్నారు. మానవత్వం మరచి వ్యక్తిగత విమర్శలు చేయడం హరీష్ రావుకే చెల్లుతుందన్నారు.…
వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మంత్రి హరీష్‌రావు.. తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన ఆమె.. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యం అని ప్రకటించారు.. అయితే, ఇప్పుడు కొత్త కొత్త పార్టీలు వచ్చాయన్నారు హరీష్‌రావు.. గతంలో రాజ శేఖర్ రెడ్డి.. తెలంగాణ సిగరెట్టా..? బీడీనా అని అసెంబ్లీలో అడిగారని.. మా నీళ్లు, నిధులు ఆంధ్రకు తరలిస్తున్నందుకు మీకు మద్దతు ఇవ్వాలా? అని ప్రశ్నించారు.. తెలంగాణ ప్రజల హృదయాల్లో వైఎస్…
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంపై సంచలన ఆరోపణలు చేశారు మంత్రి హరీష్‌రావు.. కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు వచ్చారని వ్యాఖ్యానించిన ఆయన.. బాబు తన మనుషులకు కాంగ్రెస్‌లో పదవులు ఇప్పిస్తున్నారన్న ఆయన.. చంద్రబాబు ఆనాడు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తే ఆంధ్రబాబు అని ప్రజలు వెల్లగొట్టారని.. టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరని, తన మనుషులను కాంగ్రెస్ లోకి పంపి తెలంగాణలో చంద్రబాబు అడుగు పెడుతున్నారని…
70 ఏళ్లలో జరగని అభివృద్ధి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడేళ్లలోనే జరిగిందన్నారు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీర సాగర్ గ్రామంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి ఏడేళ్ల కేసీఆర్ పాలనలో చేసి చూపించారని తెలిపారు.. యాసంగిలో దేశంలో అత్యధిక వరి సాగు రాష్ట్రంలో జరిగిందన్న ఆయన.. యాసంగిలో 52…