దమ్ముంటే ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టు బండి సంజయ్..హైద్రాబాద్ గల్లీలో కాదని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై నిప్పులు చెరిగారు. ఢీల్లీలో పోరాటం చేస్తే దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు తరలి వచ్చి పోరాటం చేస్తారని హరీష్ రావు అన్నారు. ఉద్యోగాలు.. ఉద్యోగాలు అని బీజేపీ నేతలు దొంగ జపం చేస్తున్నారు. దొంగే దొంగ అంటున్నారని అసలు…
తెలంగాణలోని ఆసుపత్రిలో ఖాళీలను భర్తీ చేయాలని, పీహెచ్ సీల పడకల సామర్థ్యాన్ని పెంచాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోగ్య మంత్రి హరీష్ రావు కు వినతిపత్రం అందచేశారు. పేద, సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందడానికి యుద్ధ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని మంత్రిని కోరారు. శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు వినతిపత్రం అందజేశారు భట్టి…
తెలంగాణకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలంటూ మంత్రి హరీష్‌రావు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు.గతంలో చేసిన అభ్యర్థనలను ఈ లేఖలో గుర్తు చేశారు మంత్రి హరీష్ రావు. A.P. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94 (2) ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రెండేండ్ల బకాయి రూ.900…
కరోనా ముంచుకు వస్తోంది. దేశవ్యాప్తంగా రోజూ లక్షలాదిమంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తెలంగాణలోనూ కేసుల తీవ్రత కొనసాగుతోంది. అయితే, వీరికి నిరంతరం సేవలందిస్తూ వారి రికవరీకి ప్రాణాలు తెగించి పోరాడుతున్నారు వైద్యారోగ్య సిబ్బంది. ఈ నేపథ్యంలో కరోనా క్లిష్ట సమయంలో అద్భుత మైన వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందిని ట్విట్టర్ లో అభినందించారు మంత్రి హరీశ్ రావు. కరోనా వేళ రాష్ట్ర వైద్య సిబ్బంది అద్భుత సేవలు అందిస్తున్నారు.మహారాష్ట్రకు చెందిన గర్బిణికి కరోనా సోకినా,నిర్మల్…
మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది.. దేశవ్యాప్తంగా కొత్త రికార్డుల వైపు కోవిడ్ కేసులు పరుగులు పెడుతున్నాయి.. మరోవైపు తెలంగాణలోనూ కరోనా విజృంభిస్తోంది.. ఈ తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.. రేపటి నుంచి రాష్ట్రంలో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి హరీష్‌రావు.. ప్రజలకు అందుబాటులో మందులు ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన ఆయన.. ఫీవర్ సర్వేలో కరోనా లక్షణాలున్నవారికి మెడికల్ కిట్ అందజేయనున్నట్టు తెలిపారు.. హోం ఐసొలేషన్ కిట్లు, టెస్టింగ్ కిట్లు,…
కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తోన్న తరుణంలో.. కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది కేంద్రం.. ఇప్పటికే కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య పెంచాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు వెళ్లాయి.. అయితే, రాష్ట్రంలోని అన్ని ఏఎన్‌ఎం, పీహెచ్‌సీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు మంత్రి హరీష్‌రావు.. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.. ఆసుపత్రిలో…
తెలంగాణా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుని కలిశారు నటుడు, ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, వీరిద్దరూ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ అందిస్తున్న సేవలను, సంస్థ కార్యకలాపాలను నందమూరి బాలకృష్ణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకి వివరించారు. అంతే గాకుండా హాస్పిటల్ అభివృద్దికి సంబంధించిన పలు అంశాలను మంత్రి…
కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ వేయించుకోవాలంటూ వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్‌లు వేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బూస్టర్ డోస్‌ను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. చార్నినార్‌లోని యునాని ఆసుపత్రిలో బూస్టర్ డోస్ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం…
కరోనా మహమ్మారి యావత్తు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత మరోసారి విజృంభిస్తోంది. అయితే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించి పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతోంది. తెలంగాణలో సైతం ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా, ఒమిక్రాన్ కట్టడికి బూస్టర్ డోస్‌ను వేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించడంతో దేశంలోని పలు రాష్ట్రాలో బూస్టర్ డోస్‌లు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో…