మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది.. దేశవ్యాప్తంగా కొత్త రికార్డుల వైపు కోవిడ్ కేసులు పరుగులు పెడుతున్నాయి.. మరోవైపు తెలంగాణలోనూ కరోనా విజృంభిస్తోంది.. ఈ తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.. రేపటి నుంచి రాష్ట్రంలో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి హరీష్‌రావు.. ప్రజలకు అందుబాటులో మందులు ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన ఆయన.. ఫీవర్ సర్వేలో కరోనా లక్షణాలున్నవారికి మెడికల్ కిట్ అందజేయనున్నట్టు తెలిపారు.. హోం ఐసొలేషన్ కిట్లు, టెస్టింగ్ కిట్లు, మరోవైపు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు మంత్రి హరీష్ రావు.. రెండు నెలల క్రితమే కోటి హోం ఐసోలేషన్ కిట్స్ సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారని.. 2 కోట్ల టెస్ట్ కిట్ లు సిద్ధం చేయాలని చెప్పారని.. ఈ కిట్స్ ను గ్రామస్థాయి వరకు పంపించామని తెలిపారు మంత్రి హరీష్ రావు.
Read Also: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కరోనా