ధరణి పోర్టల్‌లోని లోపాలపై కాంగ్రెస్ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిందని, కానీ కాంగ్రెస్ సూచనలను, సలహాలను కేసీఆర్ పట్టించుకోలేదని ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధరణిలో లోపాలను సరిచేసేందుకు హరీష్ రావు కమిటీ కేవలం కంటి తుడుపు చర్యనేనని ఆయన మండిపడ్డారు. హరీష్ రావు ఎవ్వరితోనూ పూర్తిస్థాయిలో చర్చలు జరపలేదని, గ్రామాల్లో తర తరాలుగా వ్యవసాయం చేసుకునే రైతుల హక్కులను ధరణితో భంగం కలిగిందని ఆయన మండిపడ్డారు.…
తొగుట మండలం తుక్కాపూర్‌లో బుధవారం మల్లన్న సాగర్ ప్రాజెక్టు పంపుసెట్లను స్విచాన్ చేసి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. అనంతరం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించి గోదావరి జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ మల్లన్న సాగర్‌ను పూర్తి చేసిన అనంతరం కొమురవెల్లి ఆలయ పీఠాధిపతికి అభిషేకం నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. తన వాగ్దానాన్ని విమోచించడానికి, చంద్రశేఖర్ రావు అభిషేకం చేయడానికి మల్లన్న సాగర్ నుండి…
కేంద్రం నుంచి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మరోసారి కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పంపిన లేఖలో, పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో వెనుకబడిన గ్రాంట్లు రీజియన్ నిధులు, స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు, 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన ప్రత్యేక గ్రాంట్ మరియు ఐజిఎస్‌టి సెటిల్‌మెంట్ బకాయిలతో పాటు, తెలంగాణలో అమలవుతున్న కేంద్రం ప్రాయోజిత పథకాలకు నిధులు…
బేగంపేట్ లోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)లో విద్యార్థినుల వసతి గృహానికి ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్రమైన ఆర్థిక, సామాజిక అధ్యయనం ఉన్నప్పుడే ఏ రాష్ట్రం అయినా, దేశం అయినా పురోగతి చెందుతుందని ఆయన అన్నారు. ఆ ఫలితాల ఆధారంగా మంచి పరిపాలన అందించడం సాధ్యం అవుతుందని, రాబోయే రోజుల్లో బడ్జెట్ అంశాలకు సంబంధించి సెస్ తో మరింతగా కలిసి…
కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు.. ప్రాజెక్టులు నిర్మాణం అయ్యేవి కావు.. నీళ్లు వచ్చేవి కావు.. ఆయన కారణజన్ముడు అంటూ ప్రశంసలు కురిపించారు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు గోదావరి నీటిని విడుదల చేసిన మంత్రి తన్నీరు హరీష్ రావు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రావాల్సిన సహకారం రాకున్నా అత్యుత్తమ ఆర్థిక విధానాలతో తెలంగాణ ను అన్ని రంగాలలో ముందంజలో నిలుస్తుందన్నారు..…
బీజేపీపై మరోసారి మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదలను పక్కనపెట్టి కార్పొరేట్ల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని హరీష్‌రావు విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు జాతీయ ప్రాజెక్టులు ఇచ్చి తెలంగాణకు మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. బీజేపీ నేతలు తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని తెలిపారు. బీజేపీకి ఓటు వేయకపోతే ఓటర్లను బుల్డోజర్లతో తొక్కిస్తామని రాజాసింగ్ అంటుంటే.. కిషన్‌రెడ్డి ఎందుకు స్పందించరని సూటిగా ప్రశ్నించారు. Read Also: EC: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నోటీసులు..…
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న బీజేపీపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ భాష గురించి మాట్లాడే హక్కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేదని హరీష్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో మాట్లాడుతున్న భాషనే కేసీఆర్ ఈరోజు మాట్లాడుతున్నారని.. తెలంగాణ ప్రజల భాషనే కేసీఆర్ మాట్లాడతారని తెలిపారు. బీజేపీ నేతలదే మతాల మధ్య చిచ్చు పెట్టేలా భాష అని ఆరోపించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి ఢిల్లీని కూకటివేళ్లతో కదిలించి తెలంగాణను సాధించారని హరీష్‌రావు…
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్య, తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను బలోపేతం చేసేందుకు పెద్దపీట వేస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్ థర్డ్ వేవ్ నుండి బయటపడేందుకు తెలంగాణ విజయవంతంగా చర్యలు చేపట్టడంతో పాటు మల్టీస్పెషాలిటీ హెల్త్ హబ్‌లు, మెడికల్ కాలేజీలు, దాదాపు అన్ని ప్రధాన తృతీయ శ్రేణి ఆసుపత్రులను రూ.6,000 కోట్లతో అప్‌గ్రేడ్ చేయడం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం…
తెలంగాణలో ఆశా వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 27వేల మంది ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వబోతున్నట్లు మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. ఈ మేరకు ఆశావర్కర్లకు మొబైల్స్ ఆందించే రాష్ట్ర స్థాయి కార్యక్రమం కామారెడ్డి జిల్లాలో ప్రారంభం కావడం శుభసూచకమన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందజేయాలనే ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్‌లను పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. మరోవైపు ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు.…