రాష్ట్ర ప్రభుత్వం ఫీవర్ ఆసుపత్రిలో రూ.10.91 కోట్ల విలువైన మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులను ప్రారంభించింది. ఇందులో 1,000 మందికి పైగా రోగులకు వసతి కల్పించడానికి అత్యాధునిక ఔట్ పేషెంట్ బ్లాక్, రూ. 50 లక్షలతో డయాలసిస్ సౌకర్యం మరియు అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. 60 లక్షల విలువైన మార్చురీ సౌకర్యం కల్పించనున్నారు. ఫీవర్ హాస్పిటల్‌లో కొత్త ఔట్ పేషెంట్ బ్లాక్‌కు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని…
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలతో పాటు పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను కూడా అభివృద్ధి చేసి బలోపేతం చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో మన ఊరు-మన బడి కార్యక్రమం అమలుపై విద్యాశాఖ మంత్రి, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని ప్రభుత్వ, స్థానిక పాఠశాలల్లో…
సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో, సుడా మాస్టర్ ప్లాన్ సమీక్ష సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణ భవిష్యత్ ప్రణాళిక కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామన్నారు. 2041వ సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని 20 సంవత్సరాల కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. గతంలో 3.15 చదరపు కిలోమీటర్లు ఉన్న సుడా పరిధి నేడు 310 చదరపు కిలోమీటర్లకు విస్తరించబోతున్నామని ఆయన వెల్లడించారు. సమగ్రమైన…
ప్రధాని మోడీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిలో గుజరాత్‌ను దాటిపోతున్నామని భయమా అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు వేరుపడ్డము.. బాగు పడ్డము.. 1999 లో కాకినాడ తీర్మానం చేసి, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి మోసం చేశారని ఆయన అన్నారు. నాడు బీజేపీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇవ్వకుండా దగా చేశారని, సుఖ ప్రసవం…
ప్రధాని మోడీ తెలంగాణపై చేసిన వ్యాఖలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. మళ్లీ తెలంగాణపై మోడీ అక్కసు వెళ్లగక్కారని, తెలంగాణ మీద ఎందుకు అంత వివక్ష.. ఎందుకు అంత కక్ష.. ఎందుకు అంత విషం చిమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు. రాజ్యసభలో మోడీ మాటలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచిందని, రాష్ట్ర ఏర్పాటును అయన ఎంత వ్యతిరేకిస్తున్నరో అర్థం అవుతున్నదని ఆయన అన్నారు. మోడీ…
ఇంటిటికీ వెళ్లి హెల్త్ ప్రొఫైల్ తీసుకుంటామని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ముందుగా ఈ కార్యక్రమం ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్ మొదటి డోస్ లో భారత దేశం లో తెలంగాణ ముందు ఉందని, సౌత్ ఇండియా లో రెండు డోస్ లు వేసుకున్న జిల్లాలు గా కరీంనగర్, హన్మకొండ జిల్లాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఒకప్పుడు క్యాన్సర్ వచ్చింది అంటే మనిషి చనిపోయాడు అనుకునే వారు.. ప్రపంచ…
హైదరాబాద్‌లో కాకుండా న్యూఢిల్లీలో ‘మిలియన్ మార్చ్’ నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌వీ, టీఆర్‌ఎస్ యువజన విభాగం ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. తమ హయాంలో ఎన్ని ఖాళీలున్నాయో వెల్లడించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 15 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దేశంలోని అన్ని ఖాళీ పోస్టుల భర్తీకి టైమ్ ఫ్రేమ్…
మంత్రి మల్లారెడ్డితో కలిసి మేడ్చల్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డి కోరిక మేరకు మార్చి తర్వత మేడ్చల్ మండలంలో రూ. 10 కోట్లతో మరో 50 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రిని మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనికి అనుబంధంగా మరో కోటి రూపాయలతో ఎస్ఎన్సీయూ కేంద్రాన్ని ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఅర్…
జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి హరీశ్ రావు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. అన్ని వార్డులను కలియ తిరిగారు. ఏరియా ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. 50 పడకలతో ఎంసీహెచ్ కేంద్రాన్ని ఏరియా ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటుచేస్తామన్నారు.కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెరిగాయాన్నారు. ప్రస్తుతం 52 శాతం డెలివరీలు జరుగుతున్నాయని దీన్ని 75 శాతంకు పెంచాలన్నారు. జహీరాబాద్ లోనూ ప్రభుత్వ ఆస్పత్రిలో నార్మల్ డెలివరీలు…
మహీంద్ర కంపెనీ ఆధ్వర్యంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అని ఆయన వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ లో 500 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం పడింది. కానీ 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. మిగతా 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తమిళనాడు, గోవా రాష్ట్రాల…