ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ రేపు, ఎల్లుండి తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటనపై మంత్రి హరీష్‌రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ తెలంగాణకు ఎందుకు వస్తున్నావ్.. అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ హాయంలో రైతులు ఇబ్బందులు పడ్డారని, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా.. ట్విట్టస్త్రాలు సంధించారు.
పోలీసు పహారాలేనిదే నువ్వు, నీ మామ తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఎందుకొచ్చింది హరీష్!? అంటూ ఘాటు స్పందించారు. నీ పర్యటన నేపథ్యంలో పొలాలకు వెళ్లి పోలీసులు రైతులను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పు.. అంటూ కొన్ని ఫోటోలను ఆయన పోస్ట్‌లో జత చేశారు. ప్రజాసేవలో కాంగ్రెస్ త్యాగాలు నీలాంటి అల్పులకు అర్థం కావు. రాహుల్ ను విమర్శించే స్థాయి, అర్హత నీకు లేవు అంటూ ఆయన మంత్రి హరీష్‌రావుపై విమర్శనాస్త్రాలు సంధించారు.
పోలీసు పహారాలేనిదే నువ్వు,నీ మామ తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఎందుకొచ్చింది హరీష్!?
నీ పర్యటన నేపథ్యంలో పొలాలకు వెళ్లి పోలీసులు రైతులను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పు. ప్రజాసేవలో కాంగ్రెస్ త్యాగాలు నీలాంటి అల్పులకు అర్థం కావు.రాహుల్ ను విమర్శించే స్థాయీ, అర్హత నీకు లేవు… pic.twitter.com/7edxUhYFn4
— Revanth Reddy (@revanth_anumula) May 5, 2022