తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావుకు ప్రజల్లో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నికొన్ని క్లిష్ట సమయాల్లో.. స్వయంగా తానే రంగంలోకి దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతంలో ఓ సారి పుష్కరాల సమయంలో తానే స్వయంగా పుష్కరఘాట్ క్యూలైన్ల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా చూశారు. అయితే ఆయనకు ఆయన నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ ఉందని అనడానికి ఈ ఫోటో నిదర్శనం. మంత్రి హరీష్ రావు ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తూ.. పలు అభివృద్ధి కార్యక్రామాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాన్సువాడలో 40 కోట్లతో నర్సింగ్ కాలేజీ శాశ్వత భవన నిర్మాణానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. అయితే హరీష్‌రావు మాట్లాడుతున్నంతసేపు నర్సింగ్ విద్యార్థినులు కేరింతలు కొట్టారు. అంతేకాకుండా సభలో మంత్రి హరీష్ రావు ప్రసంగించిన అనంతరం మంత్రి హరీష్‌రావుతో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు.. ఆ ఫోటోను చూసిన కొందరు.. హరీష్‌రావుకు క్రేజ్ మామూలుగా లేదుగా.. అని కామెంట్లు పెడుతున్నారు.