Minister Gottipati Ravi Kumar: జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే.. కానీ, న్యాయస్థానం ఇచ్చేది కాదు అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.. అవినీతి కేసుల్లో జైలుకెళ్లి బయటకు వచ్చి నేటికి 12 సంవత్సరాలు అయినందుకు వైఎస్ జగన్ విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నట్లున్నారు అంటూ ఎద్దేవా చేశారు.. నాటి అవినీతి కుంభకోణాల్లో జైలుకెళ్లి వచ్చినందుకు బహుశా వేడుకలు చేసుకుంటాడేమో? అని సెటైర్లు వేశారు.. జగన్ ఐదేళ్లు విధ్వంసం చేయకుండా ఉంటే అమరావతిలో ఈపాటికి సకల…
జరిగిన ప్రమాదాలకు ఎక్స్ గ్రేషియా అందించడం సమాధానం కాదు.. అసలు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పని చేయాలని సూచించారు ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. విద్యుత్ శాఖలో జరుగుతున్న ప్రమాదాలపై కారణాలను అడిగి తెలుసుకున్నారు..
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు అంటూ వైసీపీ చేసే విషప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మొద్దని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ వ్యవస్థపై జగన్మోహన్ రెడ్డి కక్ష పెట్టుకున్నందుకే రోజూ అసత్యాల బురద చల్లుతున్నాడని ఆరోపించారు.
వివిధ దేశాలకు చెందిన పునరుత్పాదక విద్యుత్ రంగ పారిశ్రామికవేత్తలు పలువురు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలు, ఇండస్ట్రియల్ పాలసీలపై చర్చించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కల అని పేర్కొన్నార ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..తాము అధికారంలోకి వచ్చే వరకు చంద్రబాబు నాయుడు బతికి ఉంటే... జైలుకు పంపుతామన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై గొట్టిపాటి రవి మండిపడ్డారు..
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమయ్యారు మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. ఈ సందర్భంగా తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఆక్వా రైతులు. నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయాలని మంత్రిని కోరారు రైతులు.. అయితే, వారి సమస్యలను విన్న మంత్రి గొట్టిపాటి.. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు రైతులకు హామీ ఇచ్చారు..
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మానవత్వం చాటుకున్నారు. మంత్రి రవి కుమార్.. చిలకలూరిపేటలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి ఒంగోలు వెళ్తున్నారు.. ఒంగోలులో జరిగే జెడ్పీ సమావేశానికి మంత్రి గొట్టిపాటి వెళ్తున్న సమయంలో త్రోవగుంట ఫ్లై ఓవర్ పై ఓ ప్రమాదం జరిగింది.
గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పాలకులు గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోయినా చోద్యం చూస్తూ కూర్చున్నారు.. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు ఎనిమిదిన్నర కోట్ల రూపాయాల నిధులు కేటాయించి.. గేట్లు మరమ్మత్తులు చేపడుతున్నాం అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్..
ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ‘రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్-2024’లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలు, మానవ వనరుల గురించి వివరించారు.
భారీ వర్షాల వల్ల జరిగిన విద్యుత్ శాఖ నష్టంపై అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష నిర్వహించారు. వీటీపీఎస్‌లోకి భారీగా వర్షపు నీరు చేరటం వల్ల 2500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని మంత్రి తెలిపారు. నీటిని తోడే పనులు నిర్విరామంగా సాగుతున్నాయన్నారు.