Minister Gottipati Ravi kumar: భారీ వర్షాలు.. విద్యుత్ శాఖ నష్టంపై మంత్రి సమీక్ష
- వర్షాల వల్ల నష్టంపై విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష
- సబ్‌స్టేషన్లు నీటమునిగాయని తెలిపిన మంత్రి
- పునరుద్ధరిస్తామని మంత్రి వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Gottipati Ravi Kumar: భారీ వర్షాల వల్ల జరిగిన విద్యుత్ శాఖ నష్టంపై అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష నిర్వహించారు. వీటీపీఎస్‌లోకి భారీగా వర్షపు నీరు చేరటం వల్ల 2500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని మంత్రి తెలిపారు. నీటిని తోడే పనులు నిర్విరామంగా సాగుతున్నాయన్నారు. పోలవరం సైట్ నుంచి హై కెపాసిటీతో నీరు తోడే పంపులు తెప్పిస్తున్నామన్నారు. బొగ్గు మొత్తం తడిచిపోవటం వల్ల విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరించేందుకు మరో 48 నుంచి 72 గంటల సమయం పడుతుందన్నారు. విజయవాడ పరిసరాల్లో విద్యుత్ అంతరాయంపై అనేక ఫిర్యాదులు వచ్చాయని.. ఎప్పుడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో అధిక వర్షం కురవడం వల్ల సబ్ స్టేషన్లు సైతం నీట మునిగాయని మంత్రి వెల్లడించారు.
Read Also: Vijayawada: చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. బెజవాడలో రికార్డ్ వర్షం
Also Read
సబ్ స్టేషన్లను పునరుద్దరిస్తూ విద్యుత్ సరఫరా చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని మంత్రి చెప్పారు. విజయవాడ నగరంలోనూ పలు చోట్ల విద్యుత్ కోతలు ఉన్నమాట వాస్తవమేనన్నారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకూడదనే కొన్ని చోట్ల ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశామన్నారు. అధికారులు, సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలోనే ఉంది ఫిర్యాదులు పరిష్కరిస్తున్నారని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులతోనూ మాట్లాడి వారి సూచనలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు వేగవంతం చేశామన్నారు. శాఖాపర సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!