Minister Gottipati Ravi Kumar: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమయ్యారు మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. ఈ సందర్భంగా తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఆక్వా రైతులు. నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయాలని మంత్రిని కోరారు రైతులు.. అయితే, వారి సమస్యలను విన్న మంత్రి గొట్టిపాటి.. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు రైతులకు హామీ ఇచ్చారు.. ఇక, విద్యుత్ లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.. విద్యుత్ సరఫరా అవసరానికి తగినట్లుగా కొత్త సబ్ స్టేషన్లను గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. సీజనల్ సబ్సిడీపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.. పలు హేచరీల యాజమాన్యాలు. హేచరీస్ యాజమాన్యాలతో అధికారులు సమావేశమై వారిపై ఆర్థిక భారం పడకుండా సమస్యపై నివేదిక కోరారు మంత్రి గొట్టిపాటి. దీనిపై ఇప్పటికే అసెంబ్లీలో చర్చించినట్లు తెలిపారు.. త్వరలోనే ఆక్వా రైతుల సమస్యలపై సరైన నిర్ణయం తీసుకుంటామని సంబంధిత రైతులకు భరోసా ఇచ్చారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. మరోవైపు.. పశ్చిమ గోదావరి పర్యటనలో ఉన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్.. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మను పరామర్శించారు..
Read Also: Minister Nadendla Manohar: రైతులకు అండగా ఉంటాం.. దళారులను ప్రోత్సహించొద్దు..