కడపలో విద్యుత్ షాక్ కొట్టి ఓ విద్యార్థి చనిపోయిన ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సీరియస్ అయ్యారు. వరుస ఘటనలపై సీఎండీలతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ మంత్రి గొట్టిపాటి హెచ్చరించారు.
వెలిగొండ ప్రాజెక్ట్ పై మాట్లాడే అర్హత మీకు లేదంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.. వెలిగొండ ప్రాజెక్టును గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపింది జగన్మోహన్ రెడ్డేనని విమర్శించారు.. ఆనాడు చంద్రబాబు సూచనలతో ప్రకాశం జిల్లా నేతలు అందరం ఢిల్లీ వెళ్లి వెలిగొండ ప్రాజెక్టు కోసం కేంద్ర మంత్రిని కలిశామని గుర్తుచేసుకున్నారు..
కొత్త విద్యుత్ ఉత్పత్తి తీసుకురాక పోవడం వల్ల గతంలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి.. అంతేకాదు 6 నుంచి 7శాతం విద్యుత్ వాడకం పెరుగుతోంది.. తమ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను తగ్గించే ప్రయత్నం చేస్తోందన్నారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.
గత ప్రభుత్వ నాసిరకమైన విధానాల వల్ల విద్యుత్ వ్యవస్థ అతలాకుతలమైంది.. విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.. గత ప్రభుత్వం విద్యుత్ అడ్డగోలుగా కొనుగోలు చేసి చార్జీలు పెంచి ప్రజల మీద భారం వేసిందని ఫైర్ అయ్యారు.
Gottipati Ravi Kumar: ఎన్నికల సమయంలో పెన్షన్స్ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి 50 మంది వృద్దులు మరణించారు అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మాపై కావాలని నిందలు వేశారని ప్రజలకు అర్థమైంది..
విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష నిర్వహించారు. ఏపీఈపీడీసీఎల్ అధికారులతో వర్చువల్‌గా మంత్రి సమీక్షించారు. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.