తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనత సాధించింది. బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రాలలో దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం… ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ (ODF) విషయంలో తెలంగాణ 96.74 శాతంతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ తర్వాతి స్థానంలో తమిళనాడు (35.39 శాతం), కేరళ (19.78 శాతం), ఉత్తరాఖండ్ (9.01 శాతం), హర్యానా (5.75 శాతం), కర్ణాటక (5.59 శాతం), ఆంధ్రప్రదేశ్ (4.63 శాతం) ఉన్నాయి. జమ్మూకశ్మీర్, బీహార్,…
కరోనా మహమ్మారి వల్ల సామాన్యులతో పాటు ఎందరో రాజకీయ నేతలు, సినిమా సెలబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కరోనా బారిన పడ్డారు. ఇటీవల వారం రోజుల పాటు రైతుల సమస్యలపై ఢిల్లీలో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి.. శుక్రవారం రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి ఎర్రబెల్లి ప్రస్తుతం…
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఖమ్మం, కరీంనగర్,నల్గొండ, మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు టీఆర్ఎస్ గెలుపు చెంపపెట్టు అని చెప్పిన ఆయన… ఇప్పటికైనా కాంగ్రెస్, బీజేపీ పార్టీ నేతలు బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా మసులుకోవాలి, లేదంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అన్నారు. ఇక నుండి కేసీఆర్, కేటీఆర్ పై…
ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ కలెక్టరేట్ లో ఈ ఎన్నిక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి విశ్వ నారాయణకు ఈ రోజు నామినేషన్లు అందించారు. కాగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రెండు నామినేషన్లు వేయగా, పోచంపల్లి తరపున మరో రెండు నామినేషన్లు పడ్డాయి. మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తో కలిసి ఒక సెట్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే…
కేంద్ర ప్రభత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్‌ఎస్ అధినేత ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కేంద్రం వైఖరితో రైతుల కోసం కేసీఆర్ పోరాటం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారని, దానికి స్పందన వచ్చిన తర్వాత మా కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ నేతలను ప్రజలు ఉరికిచ్చి కొడుతున్నారని, తెలంగాణలో…
దేవన్నపేట లోని విజయ గర్జన సభా పనులను పరిశీలించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎమ్మెల్సీ పళ్ళ రాజేశ్వర్ రెడ్డి. ఎమ్మెల్యేలు అరూరి రమేష్.. ధర్మారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, కడియం శ్రీహరి. బీజేపీతో గొడవ పెట్టుకోవాలని అనుకోలేదని, రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చినందుకే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు మంత్రి ఎర్రబెల్లి. ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పేవరకు టీఆర్ఎస్ పోరాడుతుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలన్నారు. పార్టీ విజయగర్జన సభకు ప్రజలంతా ఉప్పెనలా తరలిరావడానికి…
తెలంగాణ బీజేపీ నాయకులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. టీబీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పించండి అంటూ ఆయన ఛాలెంజ్ చేశారు. జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలకు రైతులను ఆందోళనకు గురి చేయడం అలవాటే అంటూ ఎర్రబెల్లి విమర్శలు చేశారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు…
రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోళ్లు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతుల ఆధైర్యపడవద్దని కేంద్ర కొనకపోయినా మేం ధాన్యం కొనుగోలు చేస్తామని అన్నారు. అంతేకాకుండా అధికారులు గతంలోని అనుభవాలతో ముందు సాగాలని సూచించారు. రైతులకు సాగునీరు, 24 గంటల విద్యుత్, పంట పెట్టుబడి ఇస్తున్న ప్రభుత్వం దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక్కటేనన్నారు. అంతేకాకుండా కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. చివరి ధాన్యపుగింజను…
పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్ వరంగల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో విజయ్ దేవరకొండ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. హీరో విజయ్ దేవరకొండ తమ ఫ్యామిలీ మెంబర్ అని అన్నారు. అతడు వరంగల్ వచ్చినప్పుడల్లా తమ ఇంటికి వస్తాడని ఎర్రబెల్లి వెల్లడించారు. గతంలో రెండు సార్లు వచ్చాడని, ఈరోజు కూడా వచ్చాడని ఎర్రబెల్లి…
తెలంగాణ పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సభలో తనను అవమానించారంటూ కమలాపూర్ ఎంపీపీ తడుక రాణి ఆందోళన దిగింది. అధికారిక సభకు పిలిచి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా ఎంపీపీనైనా తనపై అసభ్య పదజాలంతో ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పార్టీ మారాలని ఒత్తిడి తీసుకువస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహం…