ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఖమ్మం, కరీంనగర్,నల్గొండ, మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు టీఆర్ఎస్ గెలుపు చెంపపెట్టు అని చెప్పిన ఆయన… ఇప్పటికైనా కాంగ్రెస్, బీజేపీ పార్టీ నేతలు బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా మసులుకోవాలి, లేదంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అన్నారు. ఇక నుండి కేసీఆర్, కేటీఆర్ పై అవాకులు చేవాకులు పెలితే తగిన బుద్ధి చెబుతాం అని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తన హవాను కొనసాగించింది… ఇవాళ ఫలితాలు వెలువడిన అన్ని స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించిన విషయం తెలిసిందే.