తెలంగాణ బీజేపీ నాయకులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. టీబీజేపీ నేతలకు దమ్ముంటే కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పించండి అంటూ ఆయన ఛాలెంజ్ చేశారు. జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలకు రైతులను ఆందోళనకు గురి చేయడం అలవాటే అంటూ ఎర్రబెల్లి విమర్శలు చేశారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు చేయలేమని చేతులేత్తిసిన నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి పై విధంగా మాట్లాడారు.