తెలంగాణ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు పెను ప్రమాదమే తప్పింది… మంత్రి ఎర్రబెల్లి ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టింది… ట్రాక్టర్ దమ్ము చక్రాలు ఎర్రబెల్లి వాహనానికి తగిలాయి.. దీంతో.. ఎర్రబెల్లి వాహనం పూర్తిగా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది… మహబూబాబాద్ జిల్లా వెలిశాల-కొడకండ్ల మధ్య ఈ ఘటన జరిగింది.. ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఓ మహిళా ఎంపీడీవో విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో శుక్రవారం నుంచి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. మంత్రి తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి మాట్లాడుతూ.. తెలంగాణ మంత్రులకు సభ్యత సంస్కారం లేదని మరోసారి స్పష్టం అయిందని తెలిపారు. ఎర్రబెల్లి ఒక మహిళా ఉద్యోగిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పాజిటివ్ కాంటెక్స్ట్ లో అలాంటి…
బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. వరంగల్ మీడియాతో మాట్లాడిన ఆయన… ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు సెంట్రల్ జైలు స్థలంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేస్తారని వెల్లడించారు.. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరుగుతుందని.. అనంతరం వరంగల్ అర్బన్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తారని.. ఆ తర్వాత కడియం శ్రీహరి ఇంట్లో మధ్యాహ్న బోజనం…
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదని ధైర్యాన్ని చెప్పారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటిసరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు… ఇవాళ జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. కోవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో మాస్కుల పంపిణీ చేశారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు…