కేంద్ర ప్రభత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్‌ఎస్ అధినేత ధర్నాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కేంద్రం వైఖరితో రైతుల కోసం కేసీఆర్ పోరాటం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారని, దానికి స్పందన వచ్చిన తర్వాత మా కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బీజేపీ నేతలను ప్రజలు ఉరికిచ్చి కొడుతున్నారని, తెలంగాణలో బీజేపీ ఒక పార్టీయేనా? అని ప్రశ్నించారు. రైతుల ధాన్యం కొనుగోలు చేయకపోతే మళ్ళీ మళ్ళీ బీజేపీ నేతలను ఉరికిచ్చి కొడతారని ఆయన అన్నారు. అయితే ధాన్యం కొనుగోలు చేయాలంటూ నేడు ఇందిరాపార్క్ వద్ద టీఆర్‌ఎస్ భారీ ధర్నాకు దిగింది. ఈ ధర్నాలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, భారీ ఎత్తున్న టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలతో పాటు రైతులు పాల్గొంటున్నారు.