ఈనెల 26 నుంచి ఉత్తరాంధ్రలో మొదటి దశ బస్సు యాత్రకు వైఎస్సార్‌సీపీ శ్రీకారం చుట్టనుంది. ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. 13రోజుల పాటు ఉత్తరాంధ్రలో సామాజిక న్యాయ బస్సు యాత్ర జరగనుందని మంత్రి వెల్లడించారు.
టీచర్స్ డే సందర్భంగా విశాఖపట్నంలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకల్లో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు మా కుటుంబ సభ్యులు అని అన్నారు. ప్రభుత్వం వేరు ఉద్యోగులు వేరు కదనేది సీఎం జగన్ ఆలోచన.. ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా ఏ ప్రభుత్వం అయినా ఉంటుందా?.. అని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు పర్యటనలో ప్రసంగించిన తీరు వివాదస్పదంగా మారింది అని.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన కామెంట్స్.. ప్రజలని రెచ్చగొట్టేలా ఉన్నాయని మంత్రి బొత్స ఆరోపించారు. పుంగనూరు పర్యటనలో మాటలతో మొదలైన వివాదం చివరకు కొట్టుకునే స్థాయికి చేరింది అని మంత్రి తెలిపారు.
కేంద్రంపై పెట్టే అవిశ్వాస తీర్మానానికి తాము వ్యతిరేకమని, ఎందుకు వ్యతిరేకమో ఇప్పటికీ పార్టీ చెప్పిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. టీడీపీ స్టాండ్ ఏంటో చంద్రబాబు చెప్పాలన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే డీఎస్సీ నోటిఫకేషన్ విడుదల కాబోతోంది.. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విజయనగరం జిల్లా రాజాం ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు
పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బొత్స.. వాలంటీర్లు అంటే.. పనికిమాలిన వాళ్లా..? ఎంత హీనంగా మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. మీ పిల్లలొచ్చి పనికిమాలిన వాళ్లా..? వాళ్లకి టాలెంట్ లేదా? ఏంటి దౌర్భగ్యలా ఈ భాషా అంటూ ఫైర్ అయ్యారు.