Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి ఏదైనా వేదికపైకి వస్తే అభిమానులకు ఏదో ఒక క్రేజీ అప్డేట్ దొరకడం అలవాటే! సరదాగా మాట్లాడే క్రమంలో ఆయన నోటివెంట వచ్చే లీకులు నెట్టింట ఎంతటి హల్ చల్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్లో కూడా అలాంటి ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తన రాబోయే 158వ చిత్రం (#Mega158) టైటిల్‌కు సంబంధించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ వేడుకలో సంగీత దర్శకుడు థమన్‌తో సరదాగా సంభాషిస్తున్న సమయంలో చిరంజీవి అనుకోకుండా “కదిరి…” అనే పదాన్ని ప్రస్తావించి, వెంటనే సర్దుకుని ఆపేశారు. అయితే మెగాస్టార్ అక్కడితో ఆగిపోవడంతో అభిమానులు, మీడియా వర్గాలు అలర్ట్ అయ్యాయి. చిరు నోటివెంట వచ్చిన ఆ ఒక్క పదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దర్శకుడు బాబీ (కే.ఎస్. రవీంద్ర) కాంబినేషన్లో చిరంజీవి నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు గతంలో ‘కాకాజీ’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు చిరంజీవి “కదిరి…” అని పలకడంతో, ఈ చిత్రానికి ‘కదిరి కాకాజీ’ అని టైటిల్ ఖరారు చేసే అవకాశం ఉందనే వార్తలు ఊపందుకున్నాయి. రాయలసీమలోని కదిరి నేపథ్యం లేదా ఆ ఊరి పేరుతో ముడిపడి ఉన్న మాస్ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో ఉండవచ్చని, అందుకే ఈ టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్ నడుస్తోంది. చిరంజీవి సగం టైటిల్ లీక్ చేయడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా #Mega158 టైటిల్ పై రకరకాల మీమ్స్, పోస్ట్‌లతో రచ్చ చేస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో #Mega158 పై అంచనాలు భారీగా ఉన్నాయి. బాబీ మాస్ ఎలిమెంట్స్‌తో చిరంజీవిని సరికొత్త కోణంలో చూపించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం చిరు చేసిన ఈ చిన్న లీక్, త్వరలోనే రాబోయే అధికారిక టైటిల్ ప్రకటనపై అంచనాలను మరింత పెంచేసింది.
Also Read
- Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
- Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
తాజావార్తలు
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
-
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?