Ambati Rambabu vs Nagababu: అవును నేను సంబరాల రాంబాబునే.. అంబటి కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu vs Nagababu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంక్రాంతి పండుగ కూడా కాకరేపుతోంది.. పండుగ సమయం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ జనసేన పార్టీగా మారిపోయింది.. భోగీ సందర్భంగా ఉత్సాహంగా డ్యాన్స్‌లు వేశారు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. ఇక, భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ.. ఆయన మహిళలు, గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.. ఇదే తాజా మాటల యుద్ధానికి కారణమైంది.. ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ సెటైర్లు వేసిన జనసేన నేత, సినీ నటుడు నాగబాబు.. అంబటి రాంబాబును ఉద్దేశిస్తూ ”సంబరాల రాంబాబు గారు మీరు డ్యాన్స్ మహత్తరంగా చేసారు.. పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి వుంటే ఇంకా మహత్తరంగా వుండేది !” అని కామెంట్లూ పెడుతూ ఎద్దేవా చేశారు..
Read Also: Supreme Court: వైఎస్ వివేకా హత్య కేసు.. గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ తెలంగాణకు బదిలీ
Also Read
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
అయితే, నాగబాబు ట్వీట్‌పై అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు.. అవును నేను సంబరాల రాంబాబునే అంటూనే కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. “నువ్వు, మీ తమ్ముడు అన్నట్టు “సంబరాల రాంబాబు”నే ! కానీ.. ముఖానికి రంగు వేయను.. ప్యాకేజీ కోసం డాన్స్ చేయను !” అంటూ ఘాటుగా బదులిచ్చారు.. దీంతో.. మరోసారి సోషల్ మీడియా వేదికగా.. జనసేన వర్సెస్ వైసీపీగా పరిస్థితి మారిపోయింది.. కొందరు అభిమానులు, జనసేన శ్రేణులు.. పవన్ కల్యాణ్, నాగబాబుకు అనుకూలంగా కామెంట్లు పెడుతూ.. అంబటిపై ఫైర్ అవుతుంటే.. మరికొందరు.. అంబటికి మద్దతుగా నిలిస్తూ మెగా బ్రదర్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. కాగా, రణస్థలం వేదికగా జనసేన నిర్వహించిన యువశక్తి సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన తర్వాత.. ట్విట్టర్‌లో మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేసిన సంగతి విదితమే.. PK అంటే పిచ్చి కుక్క అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఆయన.. నేను సంబరాల రాంబాబునైతే.. నువ్వు కల్యాణాల పవన్ వి ! అంటూ మరో ట్వీట్ చేశారు.. రోజా డైమండ్ రాణి అయితే.. నువ్వు బాబు గారి జోకర్ వి ! అంటూ మరో ట్వీట్‌తో మంత్రి రోజాపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చిన విషయం విదితమే..
నువ్వు, మీతమ్ముడు అన్నట్టు
"సంబరాల రాంబాబు"నే !
కానీ…ముఖానికి రంగు వేయను
ప్యాకేజి కోసం డాన్స్ చేయను ! @NagaBabuOffl@PawanKalyan— Ambati Rambabu (@AmbatiRambabu) January 16, 2023
సంబరాల రాంబాబు గారు మీరు డ్యాన్స్ మహత్తరంగా చేసారు… పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి వుంటే ఇంకా మహత్తరంగా వుండేది ! https://t.co/p7maOu77If
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 15, 2023
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!