Off The Record: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా జడలు విప్పింది. నలుగురైదుగురు కూటమి నేతలు ముఠాలుగా ఏర్పడి…. కొండల్ని పిండిచేసి మింగేస్తున్నారట. మరీ ముఖ్యంగా ఇక్కడ జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అండదండలతో అనుచరులు బరితెగించేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన నియోజకవర్గంలో అక్రమాలకు తావులేదని బత్తుల చేస్తున్న హెచ్చరికలు ఉత్తుత్తి చప్పుళ్ళేనని, తెర వెనక వాస్తవాలు మాత్రం వేరేలా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. తన ఇమేజ్ డ్యామేజ్ అవకుండా బలరామకృష్ణ స్టేట్‌మెంట్స్…
ఉమ్మడి కృష్ణాజిల్లాలో మైనింగ్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి, కలిదిండి, ముదినేపల్లిలో పెద్ద ఎత్తున ఇసుక ఉండటంతో ఈ ప్రాంతం నుండి లారీలతో బుసక ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో ఐదు వేల కోట్ల రూపాయల విలువైన సిలికాన్.. 3 వేల కోట్ల విలువైన తెల్ల రాయిని దోచేశారంటూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మైనింగ్ గ్యాంగ్ రెచ్చిపోతోంది. పగలు రాత్రి తేడా లేకుండా ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ మట్టితవ్వేస్తూ దోచుకుంటున్నారు మైనింగ్ మాఫియా. అదేమని అడిగితే పట్టించుకునే నాథుడు లేడు. అడిగితే అధికారులను కూడా భయపెట్టే స్థాయికి బెదిరింపులతో మట్టి మాఫియా మాట్లాడుతుండటంతో వారికి అధికారపార్టీలో కొంతమంది మద్దతు ఉందని ప్రచారం జరగటంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రత్తిపాడు,పొన్నూరు, పెదకూరపాడు, వినుకొండ నియోకవర్గాల్లో రాత్రి అయితేచాలు ట్రాక్టర్లు లారీలు ప్రొక్లైనర్ల రీ సౌండ్…
ఏపీలోని పలు ప్రాంతాల్లో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. ఈ మేరకు కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో ఎన్జీటీ ఆదేశాలను అమలు చేయలంటూ సీఎస్ సమీర్‌శర్మకు ఆయన లేఖ రాశారు. కుప్పంలో జరుగుతున్న గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై గతంలో ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను సీఎస్‌కు రాసిన లేఖకు చంద్రబాబు జత చేశారు. చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలం ముద్దనపల్లిలో సర్వే నంబరు 104తో పాటు…
గుడివాడలో అధికార పార్టీకి చెందిన మట్టి మాఫియా చెలరేగిపోతోంది. మండలంలోని మోటూరు గ్రామంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై మైనింగ్ మాఫియా దాడికి దిగింది. గుడివాడ మండలం మోటూరు గ్రామంలో గత కొన్ని రోజులుగా రాత్రిళ్ళు జరుగుతున్న మట్టి తవ్వకాలపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించడంతో తవ్వకాలను అడ్డుకున్న ఆర్ఐ అరవింద్‌పై దాడికి దిగారు. మోటూరు గ్రామంలోని కాలువల వెంట మట్టి తవ్వకాలు జరుగుతుండగా తన సిబ్బందితో కలిసి ఆర్ఐ అరవింద్ అడ్డుకోవడంతో ఎదురుతిరిగిన…
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డారు పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే , బీజేపీ నేత టి.నందీశ్వర్ గౌడ్. బచ్చుగూడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. స్ధానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పై ప్రధాన మంత్రికి దొడ్డిదారిన వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించటం సాధ్యమేనా..? తాను ఎంపీపీగా, ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి…
పెద్దిరెడ్డికి పదవి, డబ్బు వచ్చిందనే అహంకారంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. చంద్రబాబు 14ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారు. అయ్యప్ప మాల ధరించిన పెద్దిరెడ్డి చంద్రబాబుపై సంస్కారహీనంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదన్నారు. సుదీర్ఘ కాలం సీఎంగా చేసిన చంద్రబాబుపై ఎప్పుడూ భూకబ్జా ఆరోపణలు రాలేదు. ఇప్పుడు వైసీపీ హయాంలో చిత్తూరు జిల్లాలో భూదందాలు, ఇసుక దందాలే. దందాలు చేసి సంపాదించిన డబ్బుతో…