మసిఉల్లా.. తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు మసిఉల్లా చుట్టూనే తిరుగుతున్నాయి. ఒక కేసులో ఆయన పేరును ముడిపెడుతూ విపక్షాలు అంతెత్తున లేస్తున్నాయి. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి ఆయన్ను తొలగించాలనే డిమాండ్ ఊపందుకుంది. దీంతో ఈ వ్యవహారంలో అధికారపార్టీ ఏం చేస్తుందనే చర్చ మొదలైంది. తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు మసిఉల్లా. ఇటీవలే తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అయ్యారు. అయితే మసిఉల్లా…
జూబ్లీహిల్స్ అత్యాచార సంఘటన జరిగినప్పటి నుంచి ప్రభుత్వం నిందితులను కాపాడే ప్రయత్నం చేసిందని.. చట్టాన్ని కాపాడే వారే ఈ కేసును నీరుగార్చడానికి అనేక కుట్రలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ స్పందించి ఆందోళన చేస్తే ఈ మాత్రం చర్యలైనా తీసుకున్నారని ఆయన అన్నారు. మొదటి నుంచి ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతగాని తనంలో ఉన్నారని విమర్శించారు. ఫార్మ్ హౌజ్ కే పరిమితం అయ్యారని…
తెలంగాణ శాసన మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, చీఫ్‌విప్ పోస్టులను ఒకేసారి భర్తీ చేస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ.. గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక్కరినే మరోసారి ఛైర్మన్‌గా చేసి సరిపెట్టేశారు. డిప్యూటీ ఛైర్మన్, చీఫ్‌విప్ పదవుల ఉసే లేదు. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ పోస్టు బీసీ సామాజికవర్గానికి దక్కుతుందని అప్పట్లో టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరిగింది. రేపో మాపో పేరు ప్రకటిస్తారని అనుకుంటూనే ఉన్నారు కానీ.. కొలిక్కి రావడం లేదు. దీంతో ఎందుకు భర్తీ…
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై టీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీ సీవీ ఆనంద్ చెప్పిన విధానం చూస్తుంటే.. అవసరమైన వాళ్లను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో నిందితులు, బాధితురాలు ప్రయాణించిన బెంజ్ కారు, ఇన్నోవా ముఖ్యమైన ఆధారాలని ఆయన అన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే, యజమానులకు సమాచారం అందించాలని..ఎంపీ యాక్ట్ ప్రకారం యజమానులను పోలీస్ స్టేషన్ కు పిలవాలని.. లేదంటే వాళ్లపై కేసులు పెట్టాలని…
జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక రేప్ కేసుపై తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. పబ్ వ్యవహారంలో నా మనువడు ఉన్నాడని కొందరు అనవసర ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అది నిజం కాదని తేలిందని… పిల్లలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని అన్నారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి భర్తీ బోర్డు ద్వారా జరిగిందని…చైర్మన్ తొలగింపు బోర్డు పరిధిలో ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ రేప్ వ్యవహారం లో పోలీసులు తమ పని…
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసు..రిమాండ్ రిపోర్టులోనూ అంతే సంచలన విషయాలు నమోదు అయ్యాయి. అయితే మీడియా సమావేశంలో పలు కీలక ఆధారాలను బయటపెట్టిన MLA(BJP) రఘునందన్‌రావు. అయితే ఇందులో భాగంగానే పలు కీలక వ్యాఖ్యలు చేశారు MLA. రఘునందన్ రావు. అయితే బాధిత అమ్మాయి పేరు గాని , ఆమె ముఖం గాని నేను చూపెట్టలేదని ఆయన తెలిపారు. ఈ కేసులో MIM నాయకులను కాపాడేందుకు మాత్రమే పోలీసులు యంత్రాంగం ప్రయత్నిస్తోందని…
మైనర్ లకు పబ్బుల్లో అనుమతి ఎవరు ఇచ్చారు..? అని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మండిపడ్డారు. అనంతరం మాట్లాడుతూ.. మైనర్ లకు పబ్బుల్లో అనుమతి పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అన్నీ దేశాల కల్చర్ తేవడం కాదు.. అమ్మాయిలకు రక్షణ ఇవ్వండని విమర్శించారు. పబ్బులు నిబంధన పాటించేలా చూడాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ ట్వీట్ లు చేసుడు కాదు.. యాక్షన్ తీసుకోవాలని ఎద్దేవ చేశారు. మైనర్ అమ్మాయి పై జరిగిన అత్యాచారంపై…
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మైనర్ బాలిక పై గ్యాంగ్ రేప్ ఘటనలో నగరానికి చెందిన ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నారని మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నవిషయం తెలిసిందే.. అయితే పోలీసులు మాత్రం ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. కాని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన విషయాలు చెప్పారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు గ్యాంగ్ రేప్ ఘటనలో ఉన్నారంటూ.. అందుకు కొన్ని ఆధారాలు చూపించారు. ఆమ్నేషియా పబ్ కు వచ్చిన మెర్సిడేజ్…
చెంచల్ గూడ జైల్లో ఉండాల్సిన వారిని కాపాడటానికి పోలీసులు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ అత్యాచార ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ లు చేసి జైళ్లలో వేస్తున్నారని..అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు హోంమంత్రి పైనే ఆరోపణలు వస్తున్నాయి.. కానీ హోంమంత్రినే విచారణ చేయాలని ట్విట్టర్లో కొంతమంది మాట్లాడుతున్నారని విమర్శించారు. హోం మంత్రి, డీజీపి ప్రగతి…
ఆమ్నేషియా పబ్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. అమ్మాయిపై సామూహిక లైంగిక దాడి చేసిన కేసులో పెద్దపెద్ద వ్యక్తుల కుమారులు ఉన్నట్లుగా బీజేపీ ఆరోపిస్తోంది. ఏకంగా హోంమంత్రి మనవడు కూడా ఈ కేసులో ప్రధాన సూత్రధారి అని, ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, వక్ఫ్ బోర్డ్ కు సంబంధించిన పెద్ద వ్యక్తి కుమారుడు, ఓల్డ్ సిటీకి సంబంధించిన ఓ పత్రికా ఎండీ కుమారుడు కూడా ఈ కేసులో ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. మరోవైపు రాజాసింగ్…