రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసు..రిమాండ్ రిపోర్టులోనూ అంతే సంచలన విషయాలు నమోదు అయ్యాయి. అయితే మీడియా సమావేశంలో పలు కీలక ఆధారాలను బయటపెట్టిన MLA(BJP) రఘునందన్‌రావు. అయితే ఇందులో భాగంగానే పలు కీలక వ్యాఖ్యలు చేశారు MLA. రఘునందన్ రావు. అయితే బాధిత అమ్మాయి పేరు గాని , ఆమె ముఖం గాని నేను చూపెట్టలేదని ఆయన తెలిపారు.
ఈ కేసులో MIM నాయకులను కాపాడేందుకు మాత్రమే పోలీసులు యంత్రాంగం ప్రయత్నిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ కేసులో కీలక ఆధారాలను తాను బయటపెట్టకముందే అవే ఆధారాలు అన్నీ TV లల్లో వచ్చాయి అని, ఇలాంటి కేసులో అధికారుల అండదండలతో అసలైన దోషులను తప్పించాలని చూడటం అనేది దుర్మార్గమైన కుట్ర అని రఘునందన్ రావు ఆరోపించారు. అయితే “కేసులు ఎదుర్కోవడం నాకు కొత్త కాదు.. పోలీస్ ఉన్నతాధికారి జోయల్ డెవిస్ కి నా గురుంచి పూర్తిగా తెలుసు…నా తప్పుంటే నా మీద కేసు పెట్టండి” అని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ కేసు విషయంలో మాజీ మంత్రులు మాట్లాడుతుంటే తనకు నవ్వు వస్తుందని వాళ్లంతా మానసిక ఆనందం పొందుతున్నారు.అలాంటప్పుడు MIM ఎమ్మేల్యే కొడుకును ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఎందుకు అడగడం లేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. మీ ఉడత ఊపులకు తాను భయపడనని మీకు నిజంగా మైనర్ బాలిక కు న్యాయం చేయాలని ఉంటే MIM ఎమ్మేల్యే కొడుకును అరెస్ట్ చేయాలని ఆందోళన చేయండి.మీరంతా MIM తో కలిసే కావాలనే ఇలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
TRS, MIM , కాంగ్రెస్ ఈ ముగ్గురు కలిసి నా మీదకు వస్తున్నారు.అయితే హోమ్ మంత్రి మనవడు గురించి ఇంకా మాట్లాడలేదు… వీడియో లు ఇంకా బయట పెట్టలేదు. తనకు కాంగ్రెస్ పార్టీ లోనూ, TRS పార్టీ లోనూ క్లయింట్ లు ఉన్నారు…నేను BJP లో చేరాక ఎక్కడ కేసులు వాదించలేదు..పాత బొమ్మలు చూపెట్టి ఏదో అనుకుంటున్నారు..మనం తర్వాత కొట్లడుకుందాం… గాని ముందు అందరం కలిసి అమ్మాయికి న్యాయం చేయాలని, దోషులకు కఠిన శిక్ష పడేవరకు పోరాడుదాం అని రఘునందన్ పిలుపునిచ్చారు.