Meta: లక్ అంటే ఇదేనేమో..? పనిచేసింది ఏమీ లేదు.. రూ.కోటిన్నర జీతం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meta: ఇప్పుడు ఎక్కడ చూసినా ఉద్యోగుల తొలగింపు వార్తలే.. ముఖ్యంగా టెక్ కంపెనీలు పోటీపడి మరీ ఉద్యోగులను తొలగిస్తున్నాయా? అనే రీతిలో ఉంది వ్యవహారం.. పేరు మోసిన టెక్ కంపెనీల నుంచి చిన్న కంపెనీల్లోనూ ఇదే తీరు ఉంది.. అయితే.. ఓ ఉద్యోగిని మాత్రం.. ఏ మాత్రం పనిచేయకుండానే దాదాపు కోటిన్నర రూపాయాలు జీతంగా అందుకుంది.. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించింది.. తాను ఏ పని చేయకుండా రూ.1.5 కోట్ల జీతం తీసుకున్నాను అంటూ.. ఫేస్బుక్ యాజమాన్య సంస్థ మెటాకు చెందిన ఓ మాజీ ఉద్యోగి విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. టెక్ సంస్థల్లో ఉద్యోగం అంటేనే.. జీతం ఎక్కువగా ఉన్నా ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుంది.. కానీ, కోటిన్నర జీతం తీసుకుని.. ఎలాంటి పనిచేయడం లేదంటూ ఓ మహిళ చెప్పడంతో.. టెక్కీలు కుల్లుకునేలా చేస్తోంది.
Read Also: IPL 2023- Punjab Kings: పంజాబ్ కింగ్స్ లో మార్పు.. జట్టులోకి ఆసీస్ బ్యాటర్
Also Read
- Forbes Billionaires List: ఆసియాలో ధనవంతుల జాబితా విడుదల.. ప్రపంచ కుబేరుల్లో భారీ మార్పులు..!
- Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
- Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
- స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
ఇంతకీ, ఎవరా? మహిళ.. ఎందుకు ఆమె ఎలాంటి పనిచేయకుండానే కోటిన్నర జీతం అందుకుంది? అసలు అంత జీతం ఇచ్చి ఆ సంస్థ ఎందుకు ఆమెను ఖాళీగా కూర్చొబెట్టింది అనే వివరాల్లోకి వెళ్తే.. మెటా కంపెనీలో రిక్రూటర్‌గా పనిచేశారు మాడెలిన్ మచాడో.. 2021లో మెటా కంపెనీలో తన 6 నెలల ఉద్యోగ అనుభవాన్ని టిక్‌టాక్ వీడియోలో వెల్లడించింది ఆమె.. రిక్రూటర్‌గా పని చేసిన తాను ఒక్కరినీ కూడా రిక్రూట్ చేయలేదని చెప్పుకొచ్చింది.. అదేంటి అనుకుంటున్నారా? అయితే, ఆ సమయంలో కంపెనీకి ఎలాంటి రిక్రూట్మెంట్ ఆలోచనే లేకపోవడమేనట.. మొత్తంగా తాను ఏ పనీ చేయకుండా సంవత్సరానికి 1,90,000 డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 1.5 కోట్లు జీతం అందుకున్నట్టు వెల్లడించింది.. తన ఉద్యోగ సమయం మొత్తం మెటా కంపెనీలో నేర్చుకోవడంలోనే గడిచిపోయేదన్న మాఎ.. ఆ సంస్థలో కొత్తగా ఉద్యోగంలో చేరినవారికి శిక్షణ ఉన్నతస్థాయిలో ఇస్తారని చెప్పుకొచ్చారు.
Read Also: Sansad Ratna Award 2023: సంసద్ రత్న అవార్డు అందుకున్న విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేష్..
మొదటి ఆరు నెలలు, మొదటి సంవత్సరం కూడా మేం ఎవరినీ నియమించుకుంటామని ఊహించలేదు. అది నిజంగా నా మనసును కదిలించింది. పర్ఫెక్ట్గా, నేను దీన్ని ఒక సంవత్సరం పాటు రైడ్ చేయబోతున్నాను, స్పష్టంగా నేను దీన్ని చేయలేదు, అని ఆమె వీడియోలో పేర్కొంది. మెటా “అత్యుత్తమ ఆన్‌బోర్డింగ్ మరియు శిక్షణ” విధానాలను “చాలా క్షుణ్ణంగా” కలిగి ఉందని జోడించి, తన రోజును “లెర్నింగ్”తో నింపినట్లు మ్యాడీ వివరించింది. అయితే, పని చేయకుండానే జీతం తీసుకున్నానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు.. దీంతో కొన్ని రోజుల తర్వాత దీనిపై వివరణ ఇస్తూ లింక్డ్ఇన్లో ఆమె పోస్ట్ చేశారు. తాను టిక్‌టాక్‌లో పెట్టిన వీడియో తప్పు కోణంలో వైరల్ అయ్యిందని.. తన ఉద్దేశం వేరు అని వివరంగా చెప్పుకొచ్చారు.. అయితే, ఇటీవల, Meta రెండవ రౌండ్ సామూహిక తొలగింపులను ప్రకటించింది. పరిశ్రమలో తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడినందున 10,000 ఉద్యోగాలను తొలగిస్తామని చెప్పింది. విస్తృతంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల కోతలు విస్తృత పునర్నిర్మాణంలో భాగంగా ఉన్నాయి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!