Meta Layoffs: ఫేస్‌బుక్, ఇస్టాగ్రామ్ మాతృసంస్థ మెటా తన మూడో రౌండ్ ఉద్యోగుల తొలగింపులను ప్రారంభించింది. ఇప్పటికే రెండు విడతల్లో వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ఇన్‌స్టాగ్రామ్ లో క్రియేటర్ మార్కెటింగ్‌గా పనిచేస్తున్న ఒక ఉద్యోగిని కూడా కంపెనీ తొలగించింది.
Meta Layoffs: అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, ఆర్థికమాంద్యం భయాలు టెక్ కంపెనీలను వణికిస్తున్నాయి. ఇప్పటికే మెటా, అమెజాన్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు వేలల్లో ఉద్యోగులను తొలగించాయి. ఆదాయం తగ్గిన నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మెటా తన ఆర్థిక పనితీరును మెరుగుపరుచుకోవడానికి, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే ప్రయత్నంలో 2023ని ‘‘ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ’’గా ప్రకటించింది.
Meta: ఆర్థికమాంద్యం భయాలు, కంపెనీల ఆదాయాలు తగ్గడంతో పలు ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాలను తొలగించాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు అయిన మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ట్విట్టర్ ఏకంగా 80 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఇదిలా ఉంటే పలు కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే ప్రత్యేక సౌకర్యాలను తగ్గిస్తున్నాయి.
Meta Layoffs: టెక్ కంపెనీలో లేఆఫ్స్ ఆగడం లేదు. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ దిగ్గజ కంపెనీలుగా పేరొందిన మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విట్టర్, అమెజాన్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను వరసగా తొలగించాయి. లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ ప్రకారం 2022 ప్రారంభం నుంచి 2,80,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో 40 శాతం మంది ఈ ఏడాదిలోనే ఉద్యోగాలను కోల్పోయారు.
Meta Layoffs: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాడానికి వేలాదిగా ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్లాన్ చేస్తోంది. గతేడాది నవంబర్ నెలలో 13 శాతం అంటే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 11,000 మంది ఉద్యోగులు కొలువుల నుంచి తీసేసింది. తాజాగా రెండో రౌండ్ కోతలను షురూ చేసింది మెటా. పెద్దమొత్తంలో ప్యాకేజీలు అందుకుంటున్న మేనేజర్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.