Meta Layoffs: ఉద్యోగులకు మెటా మరో ఝలక్.. మరిన్ని తొలగింపులకు సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meta Prepares More Layoffs Across Facebook WhatsApp Instagram: మెటా సంస్థ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తన సంస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడంలో భాగంగా.. సరికొత్త టీమ్‌లను పునర్నర్మిస్తున్నారు. బుధవారం ఉద్యోగాల కోతలను ప్రకటించడానికి సిద్ధం కావాలని ఈ ఫేస్‌బుక్ మాతృ సంస్థ మేనేజర్లకు తెలియజేసింది. మార్చిలో మార్క్ జూకర్‌బర్గ్ ప్రకటించినట్టు.. ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగానే మెటా సంస్థ కోతలకు సిద్ధమైంది. మొత్తం 10 వేల మంది తొలగించేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడు కొందరిని తొలగించి, రెండో రౌండ్‌లో భాగంగా మే నెలలో మరికొందరిని తొలగించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
Kaylin Gillis Shot Dead: తప్పుడు డ్రైవ్‌వేలో వెళ్లిన పాపానికి.. కాల్చి చంపేశాడు
Also Read
మెటా సంస్థ ఇప్పటికే నవంబర్ నెలలో 11 వేల మంది ఉద్యోగుల్ని (కంపెనీ వ్యాప్తంగా 13% మంది) తొలగించిన విషయం తెలిసిందే! ఆ సమయంలోనే జూకర్‌బర్గ్.. టెక్నాలజిస్ట్, ఇంజినీర్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌ని రీబ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నామని తెలిపాడు. అటు.. బృందాలు పునర్వ్యవస్థీకరించబడతాయని, కొత్త మేనేజర్‌ల క్రింద పని చేయడానికి కొందరు ఉద్యోగులను తిరిగి రీ-అసైన్డ్ చేయడం జరుగుతుందని మేనేజర్‌లకు ఒక మెమో పంపిణీ చేయబడిందని తెలిసింది. సమయానుకూలంగా పని చేసేందుకు గాను.. ఎవరెవరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారన్న విషయాన్ని సైతం నార్త్ అమెరికా ఉద్యోగులను మెటా అడగనున్నట్టు ఆ మెమోలో పేర్కొనబడింది. ఓ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. టెక్ గ్రూపులోని కొందరిని ఏప్రిల్ నెలలోనూ, అనంతరం బిజినెస్ గ్రూప్‌లోని మరికొంతమందిని మే నెలలోనూ తొలగించబోతున్నట్టు ప్రకటిస్తామని తెలిపాడు.
Spicejet Warning Light: ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో ఊహించని ట్విస్ట్.. వార్నింగ్ లైట్ ఎంత పని చేసింది
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!