మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల అధికారిక ఫలితాల కోసం ఆదివారం రాత్రి రెండు తెలుగు రాష్ట్రాలలోని జనం టీవీలకు అతుక్కుపోయిన సమయంలో ఊహించని విధంగా బ్రేకింగ్ న్యూస్ రావడం మొదలైంది. ‘మా’ ఎన్నికల ఫలితాలపై చిరంజీవి స్పందించారన్నది దాని సారాంశం. ‘మా’ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఓ పక్క జరుగుతున్న సమయంలోనే ‘పెళ్ళిసందడి’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అప్పటికే ‘మా’ ఫలితాల సరళి చిరంజీవికి చేరడం జరిగింది. దాంతో ఆ వేదిక మీదనే ఆయన…
తెలంగాణ వాసులు ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ‘బతుకమ్మ’ సంబరాలు మొదలయ్యాయి. ఈ తొమ్మిది రోజులూ సాయంత్రం కాగానే అందమైన పూలతో తయారు చేసిన ‘బతుకమ్మ’ను మధ్యలో పెట్టి చుట్టూ చేరి మహిళలంతా ఆటపాటలతో సందడి చేస్తారు. 9 రోజులపాటు రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తూ రోజుకో పేరుతో బతుకమ్మను సెలెబ్రేట్ చేసుకుంటారు. అందులో ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ,…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మలయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘గాడ్ ఫాదర్’ టైటిల్ తో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినిమాను ప్రారంభించారు. ‘గాడ్ ఫాదర్’ను ఎన్‌వి ప్రసాద్, రామ్ చరణ్‌లతో కలిసి ఆర్‌బి చౌదరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రబృందం ‘గాడ్ ఫాదర్’లోని పాత్రల కోసం మిగిలిన నటీనటులు, సిబ్బందిని ఖరారు చేయడంలో బిజీగా ఉంది. అయితే…
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ స్పెషల్ గా ట్వీట్ చేశారు. “సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. అతడికి మీ అందరి ఆశీస్సులు రిపబ్లిక్ చిత్ర విజయం రూపంలో అంతా అని ఆశిస్తూ, ఆ చిత్రం యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు. అలాగే కరోనా సెకండ్ వేవ్ బారినపడి కుదేలైన సినిమా ఎగ్జిబిషన్ సెక్టార్…
మెగాస్టార్ చిరంజీవి రేపు రాజమండ్రి పర్యటనకు వెళ్లనున్నారు. తూర్పు గోదావరి జిల్లా లోని రాజమండ్రికి పయనం కానున్నారు. రాజమండ్రి లోని ఓ వైద్య కళాశాలలోని అల్లు రామ లింగయ్య విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి ఆయన అక్కడికి వెళ్తున్నారు. డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల, ఆసుపత్రి ఆవరణలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సహకారంతో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించనున్నారు. అయితే ఆంధ్రాలో పవన్, వైసీపీ మధ్య మాటల యుద్ధం…
నటుడు మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగిన విషయం తెలిసిందే.. ఇటీవలే విష్ణు తన ప్యానల్ ప్రకటించారు. తాజాగా ఆయన ఎన్టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓటు తనకే వేస్తారని మంచు విష్ణు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నా అజెండా, మ్యానిఫెస్టో చూశాక పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు కూడా…
సెప్టెంబర్ 22న మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఓ ప్రత్యేకమైన రోజు. చిత్ర పరిశ్రమలో ఆయన విజయవంతంగా 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు ఓ స్పెషల్ ట్వీట్ చేస్తూ “43 ఇయర్స్ అండ్ స్టిల్ కౌంటింగ్… మై అప్పా” అంటూ లవ్ సింబల్ ను యాడ్ చేశారు. అంతేకాకుండా 43 ఏళ్ళ క్రితం నాటి ఫోటో, తాజాగా ఆయన నటిస్తున్న ఆచార్య…
సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈనెల 24వ తేదీన థియేటర్లోకి రాబోతోంది. నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించగా.. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా, తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హాజరైయ్యారు. మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘చిన్న పిల్లలు కరోనా…