ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ప్రస్తుతం ‘రంగమార్తాండ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరాఠీలో ఘన విజయం సాధించిన ‘నటసమ్రాట్’కు ఇది తెలుగు రీమేక్. అక్కడ నానా పటేకర్ చేసిన పాత్రను ఇక్కడ ప్రకాశ్ రాజ్ పోషిస్తున్నారు. ఆయనతో పాటు రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివానీ రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కృష్ణవంశీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ…
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఔదార్యం చూపించారు. మెగా అభిమానుల క్షేమం కోసం పరితపించే ఆయన.. తాజాగా ఓ అభిమానికి అండగా నిలిచారు. విశాఖకు చెందిన వెంకట్ అనే మెగా అభిమాని కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో తన అభిమాన హీరో చిరంజీవిని కలవాలని ఆకాంక్షించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయగా.. పలువురు అభిమానులు మెగాస్టార్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన మెగాస్టార్ చిరంజీవి సదరు అభిమాని తనను కలవొచ్చని తెలిపారు. అయితే అభిమాని వెంకట్…
కరోనా మహమ్మారి విజృంభించి తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆక్సిజన్ బ్యాంకు ద్వారా సేవలు అందించిన మెగా అభిమానులతో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. కరోనా మహమ్మారి రెండో దశ విరుచుకు పడుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో, జిల్లా స్థాయిలో ఆక్సిజన్ బ్యాంకు నెలకొల్పిన సంగతి తెలిసిందే.. ఈ ఆక్సిజన్ బ్యాంకు సేవలలో అన్ని జిల్లాల మెగా అభిమాన సంఘాల ప్రతినిధులు…
హీరో సాయిధరమ్ తేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు ఉదయం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. సెప్టెంబర్ 10 వ తేదీన సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ లో గాయపడిన సంగతి తెలిసిందే. 35 రోజులపాటు సాయిధరమ్ తేజ్ ఆసుపత్రిలో చికిత్స పోందారు. సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చాడని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రమాదం నుంచి బయటపడిన తేజ్కు ఇది పునర్జన్మ అని మెగాస్టార్ ట్వీట్ చేశారు.…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల అధికారిక ఫలితాల కోసం ఆదివారం రాత్రి రెండు తెలుగు రాష్ట్రాలలోని జనం టీవీలకు అతుక్కుపోయిన సమయంలో ఊహించని విధంగా బ్రేకింగ్ న్యూస్ రావడం మొదలైంది. ‘మా’ ఎన్నికల ఫలితాలపై చిరంజీవి స్పందించారన్నది దాని సారాంశం. ‘మా’ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఓ పక్క జరుగుతున్న సమయంలోనే ‘పెళ్ళిసందడి’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అప్పటికే ‘మా’ ఫలితాల సరళి చిరంజీవికి చేరడం జరిగింది. దాంతో ఆ వేదిక మీదనే ఆయన…
తెలంగాణ వాసులు ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ‘బతుకమ్మ’ సంబరాలు మొదలయ్యాయి. ఈ తొమ్మిది రోజులూ సాయంత్రం కాగానే అందమైన పూలతో తయారు చేసిన ‘బతుకమ్మ’ను మధ్యలో పెట్టి చుట్టూ చేరి మహిళలంతా ఆటపాటలతో సందడి చేస్తారు. 9 రోజులపాటు రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తూ రోజుకో పేరుతో బతుకమ్మను సెలెబ్రేట్ చేసుకుంటారు. అందులో ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ,…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మలయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘గాడ్ ఫాదర్’ టైటిల్ తో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినిమాను ప్రారంభించారు. ‘గాడ్ ఫాదర్’ను ఎన్వి ప్రసాద్, రామ్ చరణ్లతో కలిసి ఆర్బి చౌదరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రబృందం ‘గాడ్ ఫాదర్’లోని పాత్రల కోసం మిగిలిన నటీనటులు, సిబ్బందిని ఖరారు చేయడంలో బిజీగా ఉంది. అయితే…
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ స్పెషల్ గా ట్వీట్ చేశారు. “సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. అతడికి మీ అందరి ఆశీస్సులు రిపబ్లిక్ చిత్ర విజయం రూపంలో అంతా అని ఆశిస్తూ, ఆ చిత్రం యూనిట్ అందరికీ నా శుభాకాంక్షలు. అలాగే కరోనా సెకండ్ వేవ్ బారినపడి కుదేలైన సినిమా ఎగ్జిబిషన్ సెక్టార్…
మెగాస్టార్ చిరంజీవి రేపు రాజమండ్రి పర్యటనకు వెళ్లనున్నారు. తూర్పు గోదావరి జిల్లా లోని రాజమండ్రికి పయనం కానున్నారు. రాజమండ్రి లోని ఓ వైద్య కళాశాలలోని అల్లు రామ లింగయ్య విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి ఆయన అక్కడికి వెళ్తున్నారు. డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల, ఆసుపత్రి ఆవరణలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సహకారంతో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించనున్నారు. అయితే ఆంధ్రాలో పవన్, వైసీపీ మధ్య మాటల యుద్ధం…