రాజమండ్రిలో జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన జరిగింది. సమావేశం అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో పవన్ చంద్రబాబుకు మద్దతిచ్చారని.. గెలిచామన్నారు. మళ్లీ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ టీడీపీకి మద్దతిచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను వైసీపీ ప్రభుత్వం వేధించిందని లోకేశ్ పేర్కొన్నారు. కరవు.. జగన్ కవల పిల్లలు అని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం ప్రాజెక్టులను గాలికి వదిలేసిందని ఆరోపించారు.
Ram Charan: సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వారితో కలిసి రామ్‌చరణ్ దంపతుల దసరా
ఈ ప్రభుత్వ హయాంలో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రకరకాల పన్నులతో, విద్యుత్ భారాలతో ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోందని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడుతోంటే కేసులు పెడుతున్నారని.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి వేధిస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి.. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేసిందని లోకేశ్ అన్నారు. పవన్ కల్యాణ్ విజయవాడకు వస్తోంటే పోలీసులు ఆపేశారని తెలిపారు. ప్రజల తరపున పోరాడేందుకు జేఏసీ తొలి సమావేశం నిర్వహించామని.. ఈ నెలాఖరులో మూడు రోజుల పాటు ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై పోరాడతామని నారా లోకేశ్ అన్నారు. కరవుతో ఇబ్బంది పడుతోన్న రైతులను ఉమ్మడిగా పరామర్శిస్తాం.. పొలాలను పరిశీలిస్తామని తెలిపారు.
Devara: బావుంది సర్.. ఎన్టీఆర్ కూడా ఉంటే ఇంకా బావుండేది
ఈ సమావేశంలో మూడు తీర్మానాలు చేశామని లోకేశ్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ ఖండన, రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తులు, అన్ని వర్గాల సమగ్రాభివృద్ధిపై తీర్మానాలు చేపట్టామన్నారు. ప్రజల సమస్యలపైనా, రాష్ట్రాభివృద్ధి పైనా చర్చించామని లోకేశ్ తెలిపారు. తమ మధ్య గొడవలు రావు.. మేం కొట్టుకోమన్నారు. వైసీపీ వాళ్లు కొట్టుకుంటారేమోనని లోకేశ్ అన్నారు. జనసేన ఎన్డీఏ పార్టనర్ అని.. ఏపీ ప్రయోజనాలే జనసేన ప్రయార్టీ అని తెలిపారు. ఈ నెల 27వ తేదీ తర్వాత డ్రాఫ్ట్ ఓటర్ల లిస్టు రానుందని లోకేశ్ చెప్పారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగ్గకుండా ఉమ్మడిగా పని చేస్తామన్నారు. అభివృద్ధి-సంక్షేమం ఈ కూటమికి జోడెద్దుల బండి అని లోకేశ్ అన్నారు. అప్పులతో సంక్షేమం కాదు.. అభివృద్ధితో సంక్షేమం మా కూటమి నినాదమని లోకేశ్ చెప్పారు.