Kamareddy Master Plan: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతు జే.ఏ.సి. అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. కామారెడ్డి జిల్లా వడ్లూరు, ఎల్లా రెడ్డిలో మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు సమావేశం కానున్నారు. ఈసమావేశానికి 7 ఏడు గ్రామాల రైతులు హాజరుకానున్నారు. మాస్టర్ ప్లాన్ వివాదంపై ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కలెక్టర్ జితేష్ పాటిల్ స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే.. తాజా ప్రకటన పై రైతులు పునరాలోచనలో పడ్డారు. వేచి చూద్దామా? ఆందోళనలు మరింత ఉదృతం చేద్దామా? అనేదానిపై ప్రధాన చర్చ జరిపేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్ కార్యచరణ రైతు జే.ఏ.సి. ప్రకటించనున్నట్లు సమాచారం. రైతు జే.ఏ.సి. కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి.
Read also: Fatal Road Accident: ఫంక్షన్ నుంచి వస్తుండగా ఘోర ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
అయితే నిన్న కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ పై రైతులు అపోహ పడొద్దని సూచించారు. డ్రాఫ్ట్ లో మార్పులు చేర్పులకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ మాత్రమే, ఇదే ఫైనల్ కాదని క్లారిటీ ఇచ్చారు. ఈ నెల11వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని తెలిపారు కలెక్టర్. అవసరమైతే గడువు పెంచుతామన్నారు. ఇప్పటివరకు మాస్టర్ ప్లాన్ పై 1026 అభ్యంతరాలు వచ్చాయని, రైతులు వస్తే సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జోన్ అంటే భూములు తీసుకోవడం కాదని స్పష్టం చేశారు కలెక్టర్. మాస్టర్ ప్లాన్ మొదటి దశ లోనే ఉంది. రైతుల భూములు ఎక్కడికి పోవని స్పష్టం చేశారు. కామారెడ్డి కి 61.5 స్కొయర్ కిలీమీటర్ లో ఉందని, ఎవరి భూములు తీసుకోవడం లేదని, అందరి అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే.. భూమి పోయింది అనడం అపద్దమన్నారు కలెక్టర్.
Read also: Chain Snatchers: వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు.. నగరంలో పోలీసుల తనిఖీలు..
ఇంకా మార్పులు చేర్పులు అవుతాయని అన్నారు. అభ్యంతరాలు తెలియజేసిన వారికి పరిష్కారం, జవాబు తప్పకుండా ఇస్తామన్నారన్నారు. ఇంకా 60 రోజలు పూర్తి కాలేదని గుర్తు చేశారు కలెక్టర్ జితేష్ విపాటిల్. డ్రాఫ్ మాస్టర్ ప్లాన్ గురించి ఏమైనా అభ్యంతరాలు చెప్పడం జరిగిందని ప్రతి ఒక్కదానికి సీరియల్ నెంబర్ ప్రకారం రికార్డు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు కలెక్టర్. వారి సందేహాలకు జవాబు ఇస్తూనే మాస్టర్ ప్లాన్ ముందుకు పోతుందని తెలిపారు. ఎవరుకూడా అపోహలకు పోవద్దని, ప్రతి ఒక్కరికి జవాబు తప్పనిసరిగా ఇస్తామన్నారు కలెక్టర్. జనవరి 11కు 60 రోజులు పూర్తి అవుతుందని స్పష్టం చేశారు. ఇది నేను కొత్తగా చెప్పడం కాదని.. ప్లెక్సీ ద్వారా ఈప్రతిపాదన రిలీజ్ చేయడం జరిగిందని మీడియా ముందు సాక్షాలతో సహా కలెక్టర్ బయటపెట్టారు. అందులో మాస్టర్ ప్లాన్ గ్రాఫ్ తో సహా.. ఆ ప్రతిపాదనలో స్పష్టంగా ఉందని తెలిపారు కలెక్టర్ మీడియా ముందు చదివి వినిపించారు. 13 నవంబర్ 22 నుండి 11 జనవరి 23లోపు అభ్యంతరాలు ఉంటే కామారెడ్డి పురపాలక సంఘ కమిషనర్ కు తెలపాలని అందులో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు కలెక్టర్.