Maharashtra Crisis : మండుతున్న ‘మహా’ రాజకీయం.. నువ్వే నేనా అన్నట్లు థాక్రే, షిండే భేటీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అగ్గిరాచుకుంటోంది. ఒకరినొకరు పోటాపోటీగా సమావేశాలకు ఏర్పటు చేస్తుకుంటున్నారు. శనివారం పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమాశానికి ఇటు శివసేన సుప్రీం, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనికి పోటీగా శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే మద్దతుగా నిలిచిన తమ ఎమ్మెల్యేలతో సమావేశానికి పిలుపునిచ్చారు. దీంతో పోటాపోటీ సమావేశాలతో వాతావరణం ఒక్క సారిగా వేడెక్కింది.
అయితే వర్చువల్ మీట్ లో ద్వారా సీఎం మాట్లాడనున్న విషయం తెలిసిందే. అయితే మధ్యాహ్నం 2 గంటలకు అసోంలో గౌమతి హోటల్ లో రెబల్ ఎమ్మెల్యేలతో ఏక్‌నాథ్ షిండే సమావేశానికి సిద్దమయ్యారు. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు ఇచ్చేందుకు ఒక గ్రూప్ ను సిద్దం చేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో రెబల్ ఎమ్మెల్యేల భవిష్యత్ పై చర్చించనున్నారు. అయితే జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో.. శివసేన రెబల్ ఎమ్మెల్యేల విషయంలో ఆ పార్టీ ఒక నిర్ణయం తీసుకునే అకాశం ఉందని తెలుస్తోంది.
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ఈ చర్చలో సభ్యత్వం రద్దుపై.. 16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ నరహరి జైర్వాల్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని విశ్వనీయ సమాచారం. కాగా.. ఈ సస్పెన్షన్‌పై సవాలు చేసేందుకు షిండే సైతం లీగల్ బృందాన్ని సిద్ధం చేసుకుంటున్నారని అందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఒకవేల ఇలాంటి పరిస్థితులే ఏదైనా తలెత్తితే .. తెరవెనుక నుంచి షిండే వర్గానికి బీజీపీ మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. అయితే.. రెబల్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తే మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ డ్రామా మరికొంత కాలం కొనసాగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు రాజకీయ పండితులు. ఏది ఏమైనా శనివారం పోటాపోటీ సమావేశాలతో మహారాష్ట్ర దద్దరిల్లుతుందనే చెప్పొచ్చు.
India Corona: దూసుకొస్తున్న ఫోర్త్ వేవ్!.. దేశంలో 15వేలకు పైగా కేసులు
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!