ఢిల్లీ మాజీ మంత్రి, జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాకు రౌస్ అవెన్యూ కోర్టు తన భార్యను కలిసేందుకు అనుమతి మంజూరు చేసింది. కస్టడీ పెరోల్ లో వారానికి ఒకసారి అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలిసేందుకు సోమవారం కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా.. అంతకుముందు తన భార్యను వారానికి రెండుసార్లు కలిసేందుకు అనుమతి ఇవ్వాలని సిసోడియా తన దరఖాస్తులో కోరారు. కాగా.. మనీష్ సిసోడియా భార్య గత 20 సంవత్సరాలుగా…
కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మరోసారి రానున్నారు. సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నారు. అయితే.. ఎంపీ బాలశౌరి పార్టీలో చేరుతున్న సందర్భంలో పవన్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అని కాదు.. ఎంతని కాదు.. 98 శాతం స్ట్రైక్ రేట్ ఉండాలంటూ తెలిపారు. పొత్తుల్లో భాగంగా జరిగే సీట్ల సర్దుబాటు వల్ల కొందరికి బాధ కలిగించవచ్చని పవన్ వ్యాఖ్యానించారు.
గవర్నర్ కోటాలో ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ ఎం. కోదండరాం, అమీర్ అలీఖాన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సచివాలయంలో శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిశారు. ఇద్దరు ఎమ్మెల్సీ పేర్లను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదించారు. మధ్యాహ్నం గవర్నర్ కోటాలో వారిద్దరిని ఎమ్మెల్సీలుగా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కోదండరాం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఉద్యమం సమయంలో జేఏసీ చైర్మన్‌గా రాజకీయ పార్టీలను ఆయన ఏకతాటిపైకి తీసుకు వచ్చారు.
ముఖ్యమంత్రి నితీషే కాదు.. తామేమీ తక్కువ కాదంటూ ఆర్జేడీ కూడా వేగంగా పావులుకదుపుతోంది. మహాకూటమితో తెగతెంపులు చేసుకునేందుకు నితీష్‌కుమార్ సిద్ధపడుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆర్జేడీ కూడా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రణాళికలు రచిస్తోంది. బీహార్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై శనివారం మధ్యాహ్నం ఆర్జేడీ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఆర్జేడీ నేత, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో ఆ పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఈ భేటీలో రాజకీయ సంక్షోభం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన సంజయ్ మెహ్రోత్రా గురువారం సాయంత్రం సీఎం నివాసంలో ఆయనను కలుసుకున్నారు.
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 7వ తేది నుండి నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఫర్ సైంటిఫిక్లీ ఇన్‌స్పైర్డ్ లీడర్‌షిప్ (పీఎస్‌ఐఎల్-24) కార్యక్రమం గురించి సీఎంకు వివరించారు. అంతేకాకుండా.. పేద విద్యార్థుల కోసం రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలను బలోపేతం, సుసంపన్నం చేయడానికి ఏడాదిపాటు విద్యా కార్యక్రమాలను నిర్వహించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల…
ధరణిలో సమస్యల పరిష్కారంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సచివాలయంలో ధరణి కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. పోర్టల్ ప్రక్షాళనపై కమిటీ చర్చించారు. ధరణిలో భూముల సమస్యలు చాలా ఉన్నాయని కమిటీ తెలిపింది. సీసీఎల్ఎ కార్యాలయం వేదికగా కమిటీ పనిచేస్తోందని చెప్పారు. వారం రోజుల్లో కమిటీ మళ్లీ సమావేశం అవుతుందని అన్నారు. ఆన్ లైన్ లో చాలా భూములు ఎక్కలేదని.. సన్నకారు, చిన్నకారు రైతులు గుంట భూమి అమ్మడానికి ఇబ్బంది పడ్డారన్నారు. గతంలో తప్పులు పునరావృతం కాకుండా…
సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎన్ఆర్ఐ ప్రతినిధులు కలిశారు. మే 24 నుంచి 26 వరకు అమెరికాలో జరిగే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మహాసభలకు రావాలని ఇన్విటేషన్ ఇచ్చారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో ఎన్ఆర్ఐ సంఘం అధ్యక్షులు వంశీ రెడ్డి, ప్రతినిధులు మలిపెద్ది నవీన్, కవితా రెడ్డి, సురేష్ రెడ్డి, గణేష్, జ్యోతిరెడ్డి, మనోజ్ రెడ్డి, దుర్గాప్రసాద్, మనోహర్ తదితరులు ఉన్నారు. మరోవైపు.. ఈ నెల 23న రవీంద్రభారతిలో జరిగే సేవా డేస్…
డీజీపీ రవిగుప్తాను కాంగ్రెస్ నేతలు కలిశారు. ప్రభుత్వం కూలిపోతోంది అని కామెంట్స్ చేసిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో డీజీపిని కలిసిన వారిలో.. పీసీసీ ప్రధాన కార్యదర్శులు కైలాశ్ నేత, చారుకొండ వెంకటేశ్, మధుసూదన్ రెడ్డిలు ఉన్నారు. వ్యాఖ్యలు చేసిన వారిలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నారు.