TPCC Protest: హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ధర్నాలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వెంకట్, మాజీ ఎంపీ విహెచ్ సహా అనేకమంది కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తీసుకొచ్చిన కుల గణన అజెండా…
హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై కాంగ్రెస్ నేతల కీలక భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు హెచ్‌సీయూ భూముల విషయంలో ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశం కానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్‌లో…
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈనెల 10న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఆయన మరోసారి ఢిల్లీకి వెళ్లారు. సీఎంతో పాటు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినకు వెళ్లారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్‌తో ఏఐసీసీ పెద్దలు ఫోన్లో మాట్లాడారు. ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు.
కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 8.15 గం.కు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు.
Congress: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. దీంతో అతడిపై పార్టీ హైకమాండ్ కి ఫిర్యాదు చేసేందుకు క్యాడర్ రెడీ అవుతుంది. నిన్న కాంగ్రెస్ పార్టీని తిట్టినట్లు సోషల్ మీడియాలో మహిపాల్ రెడ్డికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది.
ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో కయ్యం ముదురుతోందట. తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమక్షంలో మీటింగ్ గరగరంగా సాగినట్టు తెలిసింది.నేతల వ్యవహార శైలిపై ఫిర్యాదుల వెల్లువలా వచ్చినట్టు తెలిసింది.ఆమె ముందే పరస్పరం కౌంటర్స్ వేసుకున్నారట నాయకులు. పక్క జిల్లాకు చెందిన నేత ఒకరు పార్టీని కులాల వారిగా విభజిస్తున్నారని, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చీలిపోవడం ,గ్రూప్ లుగా మారడానికి సదరు నేతే కారణమని ముందు పేరు చెప్పకుండా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
గెలుపునకు మేమందరం బాధ్యత తీసుకున్నాం.. ఓటమి కూడా సమిష్టి బాధ్యత అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీ అభ్యర్థులకు సపోర్ట్ చేసిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా చూపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సభ్యుల ఓటమిపై ఎంపీ మల్లు రవి ఢిల్లీలో మాట్లాడారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేసింది. నియోజక వర్గ ఇంఛార్జుల పని తీరు ఏం బాగోలేదని వెల్లడించింది. మంత్రి వర్గ విస్తరణ తర్వాత ఆదిలాబాద్ జిల్లా పదవీ బాధ్యతల నుంచి తప్పుకుంటాను అని తెలిపింది.
Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో నేతలను నూతన ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ మూడు కేటగిరీలుగా విభజించింది. మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్న వాళ్లు ఒక గ్రూప్ గా.. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు రెండో గ్రూప్.. అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరిన వారు మూడో గ్రూప్ గా విభజించిన నటరాజన్.