Congress: సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. రెబల్స్‌ను ఎందుకు బుజ్జగించలేదు.. సొంత బంధువులకు టికెట్ ఇప్పించేందుకు పార్టీకి నష్టం చేశారని పీసీసీ తేల్చింది. దీంతో అగ్రనాయకులు ఎమ్మెల్యేలకు అక్షింతలు వేశారు. ఈ ఘటన మరోసారి రిపీట్ అయ్యిందంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాలమూరు ఎమ్మెల్యేలపై కూడా అసహనం వ్యక్తం చేసినట్లు…
TPCC Meeting: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) విస్తృత స్థాయి సమావేశం నేడు (మంగళవారం) గాంధీభవన్‌లో జరగనుంది. పార్టీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ కీలక భేటీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులతో పాటు, ఇదివరకు ఆ పదవుల్లో కొనసాగిన…
Off The Record: ఆదర్శంగా ఉండాలని అనుకోవడంలో తప్పు లేదు. గాంధీ సిద్ధాంతాలను ఫాలో అవడం గురించి అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఆ విషయంలో ఎవ్వరికీ అభ్యంతరాలు ఉండకూడదు కూడా. కానీ… తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా ఉందంటూ ఆ పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే…. ఆమె వ్యవహార శైలి కొరకరాని కొయ్యలా మారిందన్న చర్చ నడుస్తోంది గాంధీభవన్‌లో. స్థానిక నాయకులతో సంబంధం…
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ( అక్టోబర్ 25న) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అగ్ర నేతలతో ఆయన కీలక సమావేశం జరిపే అవకాశం ఉంది.
Konda Surekha : రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ లను కలిశారు. ఈ భేటీలో గత కొద్ది రోజులుగా తాను ఎదుర్కొంటున్న పరిణామాలను మంత్రి సురేఖ వివరించారు. సమావేశంలో ఆమె తన కుటుంబంపై జరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు, పోలీసుల చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా, నిన్న రాత్రి తన…
సోమాజిగూడ శ్రీనగర్‌లో బూత్ స్థాయి సన్నాహక సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. వీరితో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ రియాజ్, కార్పొరేటర్లు విజయా రెడ్డి, సంగీత, మాజీ ఎంపీ అజారుద్దీన్, ఎన్‌ఎస్‌యూఐ సెక్రటరీ కుందన్ యాదవ్, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, స్థానిక సీనియర్ నాయకులు సమావేశంకు హాజరయ్యారు. ఈ సందర్భంగా…
Congress Meeting: తెలంగాణ కాంగ్రెస్‌లో నేడు ( అక్టోబర్ 7న) కీలక పరిణామాలు చోటు చేసుకోనుంది. ముఖ్యంగా, బీసీ నేతల అత్యవసర సమావేశం ఈరోజు సాయంత్రం 4:00 గంటలకు జరగనుంది. రేపు ( అక్టోబర్ 8న) హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు రానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ సంస్థాగత నిర్మాణం, పీఏసీ అజెండాపై చర్చిస్తున్నారు.
Meenakshi Natarajan : ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వ్యాపార వర్గాలకే సేవలు చేస్తోందని కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ మండిపడ్డారు. ఆదివారం సంగారెడ్డిలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, “మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీల కోసమే పని చేస్తోంది” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, దేశంలో ప్రస్తుతం రెండు రకాల పాలన మోడల్స్ ఉన్నాయని పేర్కొన్నారు. ఒకటి తెలంగాణ మోడల్ కాగా, రెండవది విద్వేష పూరిత పాలన మోడల్. తెలంగాణలో అమలవుతున్న…
Meenakshi Natarajan Padayatra Schedule: జులై 31 నుంచి ఆగస్టు 6వరకు పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలు ఉంటాయని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పరిగి నియోజకవర్గం నుంచి మొదలై వర్ధన్నపేట వరకు పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు పాల్గొననున్నారు. స్థానిక సంస్థల…