హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాల నిర్మాణానికి పునాది రాయి వేయడం జరిగింది. దసరా పర్వదినం సందర్భంగా శాస్త్రోక్త పద్ధతిలో పూజలు చేసి, ఎంఈఐఎల్ డైరెక్టర్ కె. గోవర్ధన్ రెడ్డి నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు.
CM Revanth: తెలంగాణ రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో పని చేయాలని.. ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ప్రతి కళాశాలను సందర్శించి అక్కడ ఏం అవసరాలు ఉన్నాయి. ఎంత మేర నిధులు కావాలి, తక్షణమే పూర్తి చేయాల్సిన పనులు, ప్రభుత్వపరంగా అందించాల్సిన సహాయం తదితర వివరాలతో నివేదికను సమర్పించాలని సీఎం…
Union Budget 2025: 2025-26 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో అనేక కీలక ప్రకటనలు చేసారు. ఇందులో ముఖ్యంగా.. మధ్య తరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ను అందిచారు. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు కల్పించారు నిర్మలా సీతారామన్. అలాగే సీనియర్ సిటిజన్స్‌కు TDS మినహాయింపు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. అలాగే అప్‌డేటెడ్ ఇన్‌కమ్ ట్యాక్స్ నమోదుకు సమయం 4 ఏళ్లకు పొడిగించారు.…
ఉక్రెయిన్‌లో ఇరవై వేల మందికి పైగా భారతీయులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది వైద్య విద్యార్ధులు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో వారిని కేంద్ర ప్రభుత్వం క్షేమంగా స్వదేశం రప్పించింది. ఐతే, కర్ణాటకకు చెందిన మెడికల్ స్టూడెండ్ నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడ తాజా ఘర్షణలకు బలయ్యాడు. ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో నవీన్ చదువుతున్నాడు. ఈ ఘటన తరువాత ఉక్రెయిన్ వైద్య విద్య అందరి దృష్టిని ఆకర్షించింది. భారత్‌లో మెడిసిన్ సీటు రాని వారు విదేశీ యూనివర్సిటీల…
ప్రముఖ కణజీవ శాస్త్రవేత్త డా.కమల్ రణదివెకు టెక్ దిగ్గజం గూగుల్ ఘన నివాళి అర్పించింది. కమల్ రణదివె భారత దేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త. ఈమె కాన్సర్, వైరస్ ల మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేసి ప్రసిద్ధి పొందారు. భారత మహిళా శాస్త్రవేత్తల సంఘం స్థాపకురాలు. ఈమె 1982 లో పద్మభూషణ్ అవార్డును పొందారు. ఈ అవార్డు ఆమె లెప్రసీ రోగులపై చేసిన పరిశోధనకు గాను పొందింది. 1960 లో ఈమె భారతదేశంలో మొదటి…
వైద్యవిద్యా కోర్సులకు సంబందించి రిజర్వేషన్లను కేంద్రం ఖరారు చేసింది. ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు కేంద్రం పేర్కొన్నది. యూజీ, పీజీ, దంతవైద్య విద్యాకోర్సులకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని అన్నారు. 2021-22 విద్యాసంవత్సరం నుంచి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని కేంద్రం ప్రకటించింది. దేశంలో సామాజిక న్యాయంలో కొత్త అధ్యాయనం మొదలైందని ప్రధాని మోడి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏడాది కాలంగా విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చినట్టు ప్రధాని తెలిపారు. వైద్యవిద్యలో ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్…