వైద్యవిద్యా కోర్సులకు సంబందించి రిజర్వేషన్లను కేంద్రం ఖరారు చేసింది. ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు కేంద్రం పేర్కొన్నది. యూజీ, పీజీ, దంతవైద్య విద్యాకోర్సులకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని అన్నారు. 2021-22 విద్యాసంవత్సరం నుంచి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని కేంద్రం ప్రకటించింది. దేశంలో సామాజిక న్యాయంలో కొత్త అధ్యాయనం మొదలైందని ప్రధాని మోడి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఏడాది కాలంగా విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చినట్టు ప్రధాని తెలిపారు. వైద్యవిద్యలో ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్ వారికి రిజర్వేషన్ల కారణంగా వారికి వైద్య విద్యను అభ్యసించేందుకు అన్నివిధాలుగా సహకరించినట్టు అవుతుందని ప్రధాని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Read: అధునాతన హంగులతో ప్రసాద్స్ మల్టీప్లెక్స్