ఆమె వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనికి అది రెండో పెళ్లి. ఇది ఆమె కుటుంబానికి నచ్చలేదు. కోపంతో ఊగిపోయిన మహిళ మేనమామ.. ఆమె ఇంటికి వెళ్లాడు. మహిళను బయటకు ఈడ్చుకొచ్చి కొడవలితో గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆ 20 ఏళ్ల మహిళను హతమార్చాడు మేనమామ.
జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లో జరిగిన ఒక వివాహానికి ఉచిత భోజనం కోసం దొంగచాటుగా వచ్చిన కొంతమంది ఆహ్వానం లేని అతిథులు, వేడి పూరీలను వేయలేదని తిరస్కరించిన తర్వాత భారీ గందరగోళం సృష్టించారు. ఆ పెళ్లిలో వేడివేడి పూరీల కోసం రచ్చరచ్చ చేశారు. పోలీసుల రంగ ప్రవేశంతో ఆ గొడవ ముగిసింది.
Viral : ఎవరి జీవితంలోనైనా వివాహం అత్యంత ముఖ్యమైన సంఘటన. ఇది ప్రత్యేకంగా ఉండాలని ప్రతి ఒక్కరూ చాలా ప్రయత్నిస్తారు. కానీ అనుకోకుండా ఏదో ఒక అంశం ఆ వేడుక తర్వాత చర్చనీయాంశంగా మారుతుంది.
ఒక్కోసారి సరదాగా చేసే పనులు కూడా తీవ్ర దుమారానికి దారి తీస్తాయి.. సందడిగా ఉన్న వాతావరణాన్ని కాస్తా గందగోళం చేస్తాయి.. ఓ పెళ్లి వేడుకలో పెళ్లికొడుకు బావమరిది సరదాగా చేసిన పని గొవడకు దారి తీయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో గురువారం ఉత్తరప్రదేశ్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్(STF)తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. అతిక్ అహ్మద్ తన 19 ఏళ్ల కుమారుడి పెళ్లిని తన సోదరి కుమార్తెతో నిర్ణయించినట్లు తెలిసింది.
ఆయనకు 45 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నారు. కానీ రాంపూర్ మున్సిపల్ సీటును మహిళలకు రిజర్వ్ చేయాలనే నిర్ణయం దాని ప్రస్తుత అధ్యక్షుడు మామున్ ఖాన్ తన కోసం వధువును వెతుక్కునేలా చేసింది.
Marry Now Pay Later: పెళ్లి చేయాలంటే బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి. ఎందుకంటే.. మన దేశంలో చాలా మంది.. మ్యారేజ్‌ని ప్రెస్టేజ్‌గా భావిస్తారు. అందరూ గొప్పగా చెప్పుకోవాలని ఆశిస్తారు. అందుకే.. అప్పు చేసి మరీ పప్పన్నం పెట్టేందుకు వెనకాడరు. దీనికోసం కొందరు.. తెలిసినవారి దగ్గర డబ్బు తీసుకుంటారు. మరికొందరు.. బ్యాంకుల నుంచి లోన్లు పొందుతారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని నవతరం ఫిన్‌టెక్ కంపెనీలు.. బై నౌ పే లేటర్.. మాదిరిగా.. మ్యారీ నౌ పే లేటర్..…
కుర్రాళ్లకు నేను చెప్పేది ఒక్కటే.. రిలేషన్ లో ఉంటే.. అన్నింటినీ అనుభవించండి.. కోపాలు.. తాపాలు, బాధలు, బ్రేకప్స్ కూడా.. అంతేకానీ ఎమోషనల్ అయిపోయి.. పెళ్లి మాత్రం చేసుకోకండి.. కొన్నేళ్ల పాటు కలిసి ఉండి.. తన గురించి.. నీకు.. నీ గురించి తనకు తెలిసిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండి అంటూ శిఖర్ ధావన్ తెలిపాడు.
Marriage Fraud: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ప్రతి జంట వారి మనస్సులో సంతోషకరమైన ప్రపంచం ఊహించుకుంటారు.