Seat reserved for women, Congress leader finds a bride: ఆయనకు 45 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నారు. కానీ రాంపూర్ మున్సిపల్ సీటును మహిళలకు రిజర్వ్ చేయాలనే నిర్ణయం దాని ప్రస్తుత అధ్యక్షుడు మామున్ ఖాన్ తన కోసం వధువును వెతుక్కునేలా చేసింది. అది కూడా 45 గంటల్లోనే వెతుక్కోవడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ మునిసిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మమున్ షా ఖాన్, ఈ పదవిని మహిళలకు రిజర్వ్ చేసినట్లు తెలుసుకున్న తర్వాత తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇది మనదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణంగా జరిగేదే. భార్యలను ఎన్నికల్లో నిలబెట్టి భర్తలు అధికారాలను అనుభవించడం అనేది చాలా ప్రాంతాల్లో జరుగుతుందని ఓటీటీ సిరీస్ పంచాయతీలో హైలైట్ చేయబడింది. చాలా ప్రాంతాల్లో భర్తలే అధికారిక కార్యక్రమాలకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Read Also: Job Scam Alert: రూ. 2,999 చెల్లిస్తే రూ.15 వేల జాబ్.. ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం!
45 ఏళ్ల కాంగ్రెస్ నాయకుడు ఈ సీటు మహిళలకు రిజర్వ్ చేయబడిందని గ్రహించిన 45 గంటల్లోనే తన పెళ్లిని ఫిక్స్ చేసినట్లు సమాచారం.మునిసిపల్ ప్రెసిడెంట్ ఎన్నిక ప్రకటించిన తర్వాత ఇది జరిగింది. నామినేషన్‌కు చివరి తేదీ ఏప్రిల్ 17 కాగా.. మమున్ షా ఖాన్ వివాహం ఏప్రిల్ 15 శనివారంగా నిర్ణయించబడింది.వాస్తవానికి, మమున్ షా ఖాన్ వివాహం చేసుకోకూడదని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. మహిళలకు రిజర్వేషన్ ప్రకటించే వరకు స్వయంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపారు. మునిసిపల్ ఎన్నికలు, తన వివాహం రెండింటికి సన్నాహాలు జరుగుతున్నాయని.. ఒక మహిళకు సీటు తప్పనిసరి అయినందున, అతను తన పెళ్లిని ప్రకటించవలసి వచ్చిందని మమూన్ షా ఖాన్ చెప్పాడు.