ఒక్కోసారి సరదాగా చేసే పనులు కూడా తీవ్ర దుమారానికి దారి తీస్తాయి.. సందడిగా ఉన్న వాతావరణాన్ని కాస్తా గందగోళం చేస్తాయి.. ఓ పెళ్లి వేడుకలో పెళ్లికొడుకు బావమరిది సరదాగా చేసిన పని గొవడకు దారి తీయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే కామన్ గా పెళ్లిళ్లలో వధూవరుల్ని ఆట పట్టించడం కామన్.. వారి వస్తువుల్ని దాచి పెట్టడం.. ఫన్నీ మూమెంట్స్ చేయడం.. సరదా గిఫ్ట్ లు ఇవ్వడం వంటివి మనం చూస్తూనే ఉంటాం.. అన్ని వేళలా వేళాకోళం తగదు అన్నట్లు ఓ పెళ్లిలో పెళ్లికొడుకు బావమరిది పెళ్లికొడుకు పట్ల ప్రవర్తించిన తీరు పెళ్లికొడుక్కి చిరాకు తెప్పించే విధంగా చేసింది. ఒక చోట పెళ్లి వేడుకలో వధూవరులిద్దరూ కూర్చుని ఉన్నారు. వేదిక చుట్టూ బంధువులు అంతా నిలబడి ఉన్నారు.
@gharkekalesh pic.twitter.com/9ZFVysNHrk
— Arhant Shelby (@Arhantt_pvt) April 8, 2023
Also Read : Covid-19: దేశంలో వరుసగా నాలుగో రోజు 10 వేలు దాటిన కొవిడ్ కేసులు
పెళ్లికొడుకు బావమరిది పెళ్లికొడుకు వెనుక నుంచొని సైలెంట్ గా ఉండకుండా వరుడి పగిడీని సర్థడం మొదలు పెట్టాడు.. అక్కడితో ఆగకుండా పగిడీ టోపీని లాగడం.. తీయ్యడం పెట్టడం.. చేశాడు.. అక్కడితో ఆగకుండా పెళ్లి కొడుకు బుగ్గలు గట్టిగా నొక్కడంతో చిరెత్తుకొచ్చి ఒక్కసారిగా బావమరిది మీద పెళ్లికొడుకు విరుచుకుపడ్డాడు. లాగిపెట్టి కొట్టడం మొదలు పెట్టాడు. ఇక పెళ్లి కూతురుతో సహా అక్కడ ఉన్నవారంతా వారిని విడదీయడానికి తీప్పలు పడ్డారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అర్హనంట్ సిల్బీ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోని నెట్టింట పోస్ట్ చేయడంతో చాలామంది వీడియోని చూశారు.. పెళ్లికొడుకు బావమరికి బాగా బుద్ది చెప్పాడని కామెంట్స్ పెడుతూ అతనికి మద్దతు ఇచ్చారు. సరదాకు కూడా ఒక సమయం సందర్భం ఉంటుందని అతి చేస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయని ఈ వీడియోను చూస్తే అర్థం అవుతుంది.
Also Read : PAK VS NZ: రికార్డు సృష్టించిన బాబర్ ఆజమ్..