Divorce Case: ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో కొత్తగా పెళ్లయిన ఒక మహిళ, మూడు రోజులకే విడాకుల కోసం అప్లై చేసుకుంది. పెళ్లి రాత్రి తన భర్త శారీరకంగా అసమర్థుడని ఒప్పుకున్నాడని ఆమె ఆరోపించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. తర్వాత వచ్చిన వైద్య నివేదికలో వరుడు ‘‘తండ్రి కాలేదు’’ అని నిర్ధారణ అయిందని వధువు కుటుంబం పేర్కొంది. పెళ్లికి అయిన ఖర్చులు, బహుమతులు తమకు తిరిగి ఇవ్వాలని పెళ్లికూతురు కుటుంబం డిమాండ్ చేస్తోంది.
Pakistan Woman: ‘‘మోడీ గారు మీరే నాకు న్యాయం చేయాలి’’ అని ప్రధాని నరేంద్రమోడీని పాకిస్తాన్‌కు చెందిన ఒక మహిళ కోరుతోంది. తన భర్త తనను మోసం చేసి, ఢిల్లీలో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపించింది. పాకిస్తాన్ కరాచీకి చెందిన నికితా నాగ్‌దేశ్ అనే మహిళ ప్రధాని మోడీకి వీడియో అప్పీల్ చేసింది.
Vikarabad: పెళ్లికి ముందే భార్య ప్రేమాయణం తెలుసుకుని భర్త తరిమేశాడు...!! భర్తకు దూరమైన విషయం తెలిసి ప్రియుడు మరోసారి దగ్గరయ్యాడు !! భర్త వదిలేస్తేనేం నీకు నేనున్నాంటూ చేరదీశాడు. కానీ.. ఈసారి ఆ ప్రియుడు నమ్మించి వంచించాడు. శారీరకంగా వాడుకుని వదిలేశాడు. అటు భర్తకు దూరమై.. ఇటు ప్రియుడూ వదిలేసి.. ఏకాకిలా మారింది ఆ యువతి. చేసేది లేక న్యాయం కోసం తాండూరు పోలీసులను ఆశ్రయించింది యువతి.
ఒకప్పుడు భర్తల వేధింపులు భరించలేక భార్యలు ఆత్మహత్యలకు పాల్పడేవారు. తర్వాత కట్నం వేదింపులకు మహిళలు బలయ్యేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. భార్య వేదింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొంత మంది భర్తలు. సరిగ్గా గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఫొటోలో కనిపిస్తున్న వీరి పేర్లు బ్రహ్మయ్య, కౌసల్య. వీరిద్దరూ భార్యాభర్తలు. కాపురానికి వచ్చిన మొదటి మూడు నెలలు అంతా బాగానే ఉంది. తర్వాత అత్తతో కౌసల్యకు విభేదాలు మొదలయ్యాయి. అది కాస్తా ముదిరింది.…
High Court: పెళ్లి తర్వాత పురుషుడు లేదా స్త్రీ తమ స్నేహితులతో ‘‘అసభ్యకకరమైన’’ సంభాషణల్లో పాల్గొనకూడదని, ఏ భర్త తన భార్య నుంచి అలాంటి చాటింగ్‌ని సహించలేడని మధ్యప్రదేశ్ హైకోర్టు పేర్కొంది. విడాకులకు అనుమతి ఇస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ని కొట్టివేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
Judge: విడిపోయిన భార్యాభర్తల మధ్య మధ్యవర్తిత్వం చేస్తున్న సెషన్స్ కోర్ట్ జడ్జి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. జడ్జి సదరు మహిళను ఉద్దేశించి, ఆమెకు ‘‘బొట్టు’’, ‘‘మంగళసూత్రం’’ ధరించడం లేదని, మీ భర్తకు మీపై ఎందుకు ఆసక్తి చూపిస్తాడు..? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. పూణేకి చెందిన వివాదాలను వాదించే లాయర్ అంకుర్ ఆర్ జహంగీర్ దీని గురించి లింక్డ్‌ఇన్‌లో షేర్ చేశారు. గృహహింస కేసులో సదరు జంట న్యాయమూర్తి ముందు హాజరయ్యారని జహంగీర్ తెలిపారు. వివాదాన్ని…
Instagram Love : ఇన్ స్టాగ్రామ్ పరిచయం ఓ యువతి కొంపముంచింది. బెంగళూరులో ఇన్ స్టాలో ప్రేమ పేరుతో రూబియా(22)కు మహారాష్ట్రకి చెందిన మన్వర్(28) పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. 8 నెలల పాటు బెంగళూరులో యువతితో మన్వర్ సహజీవనం చేశాడు. అయితే.. 10 రోజుల క్రితం బెంగళూరులో పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో ఉంటున్న మన్వర్ తల్లితండ్రుల వద్దకి వచ్చారు జంట. మన్వర్ తల్లిదండ్రులు ఒప్పుకోకొకపోవడంతో ఇంట్లో గొడవ జరిగింది. భర్త మన్వర్ కూడా…