గత ఆరు నెలలుగా మణిపూర్ లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతునే ఉన్నాయి. అయితే, ఈ సంఘటనతో ఆ రాష్ట్రం ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఇక, తాజాగా మణిపూర్ ప్రభుత్వం నాలుగు హిల్ జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ చేస్తున్నట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదు. ఉఖ్రుల్, సేనాపతి, చందేల్ తో పాటు తమెంగ్‌లాంగ్ జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో ప్రయోగాత్మకంగా ఇంటర్నెట్ ఆంక్షలను ఎత్తివేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
Read Also: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ లో ఎన్నికలు.. విధుల్లో ఉన్న 200 మందికి పైగా అధికారులు మిస్సింగ్..
మణిపూర్ హైకోర్టు అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో (కుల హింసకు గురికాని) మొబైల్ టవర్లను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన తర్వాత ఈ చర్య వచ్చింది. మంగళవారంనాడు నాలుగు కొండ జిల్లా కేంద్రాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ గురించి ఉఖ్రుల్ జిల్లా పరిపాలన అధికారిని అడిగినప్పుడు.. జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో కొన్ని ఎంపిక చేసిన మొబైల్ టవర్లు మాత్రమే యాక్టివేట్ చేయబడ్డాయి.. కానీ కనెక్టివిటీ పేలవంగా ఉంది. పునరుద్ధరణ ప్రయోగాత్మకంగా జరుగుతుందన్నారు.
Read Also: Stock Market Opening: ఒడిదుడుకులతో ప్రారంభమైన మార్కెట్లు.. దీపావళి కాంతి వచ్చేనా ?
ఉఖ్రుల్‌లో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా మంత్రి కాశీం వాషుమ్ నాలుగు జిల్లాల్లో సేవలను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. జాతి ఘర్షణల కారణంగా మణిపూర్‌లో మే 3 నుంచి మొబైల్ ఇంటర్నెట్ నిషేధించబడింది. సెప్టెంబర్‌లో కొన్ని రోజులు మినహా.. మేలో మొదటిసారిగా కుల హింస చెలరేగినప్పటి నుంచి మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతోంది. అప్పటి నుండి 180 మందికి పైగా మరణించారు. మెయిటీస్ వర్సెస్ కుకీస్ తెగలకు చెందిన ప్రజలు ఒకరిపై ఒకరు జాతి ఘర్షణలు చేసుకున్నారు. మణిపూర్ జనాభాలో మెయిటీలు దాదాపు 53 శాతం ఉన్నారు.. ఎక్కువగా ఇంఫాల్ లోయలో వీరు నివసిస్తున్నారు. నాగాలు, కుకీలతో సహా గిరిజనులు 40 శాతం ఉన్నారు. వీరు ప్రధానంగా కొండ జిల్లాలలో నివసిస్తున్నారు.