మణిపూర్‌లో అక్రమ వలసదారులు, మిలిటెంట్ల సమస్యను ఒక్కసారిగా పరిష్కరించడానికి సర్జికల్ స్ట్రైక్ వంటి ప్రభావవంతమైన చర్య జరగాలని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) నాయకుడు ఎం.రామేశ్వర్ సింగ్ అన్నారు.
మణిపూర్‌లో మహిళలు ఘోరమైన అఘాయిత్యాలకు గురవుతున్న తీరుపై వేదన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఓ వర్గానికి అణిచివేత సందేశాన్ని పంపేందుకు ఆకతాయిలు లైంగిక హింసకు పాల్పడుతున్నారని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
లోక్‌సభలో మణిపూర్ హింసాత్మక ఘటనలపై చర్చ జరుగుతుండగా.. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పార్లమెంటులో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం విరుచుకుపడ్డారు.
జాతి హింసతో అట్టుడికిపోతున్న ఈశాన్య రాష్టమైన మణిపూర్‌లో అకృత్యాలు ఆగడం లేదు. అక్కడి మహిళలపై జరుగుతున్న ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశాన్ని కుదుపేసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌లోని ఉభయసభల్లోనూ నిరసన జ్వాలలు చల్లారకముందే మరో ఘటన వెలుగుల
ప్రతిపక్ష కూటమి 'ఇండియా'లోని 16 పార్టీలకు చెందిన 21 మంది ఎంపీల బృందం హింసాత్మక మణిపూర్‌కు చేరుకుంది. హింసాత్మకంగా దెబ్బతిన్న రాష్ట్రంలో క్షేత్రస్థాయి పరిస్థితులను నేతలు అంచనా వేయనున్నారు.
మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో ప్రతిష్టంభన మధ్య, ప్రతిపక్షాలు బుధవారం మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకురాబోతున్నాయి. లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మంగళవారం రాత్రి ఈ విషయాన్ని ప్రకటించారు.
మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై పార్లమెంట్‌లో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌ను వర్షాకాల సమావేశాల మిగిలిన కాలానికి రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు.
మహిళలపై జరుగుతున్న నేరాలు, మణిపూర్‌లో జాతి హింసపై కేంద్రం, ప్రతిపక్షాలు మరోసారి గొంతు చించుకున్నాయి. మణిపూర్‌లో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాల ఆరోపణలపై అనేక మంది ప్రతిపక్ష ఎంపీలు వరుసగా మూడు రోజుల పాటు లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ గట్టిగా వాయిదా నోటీసులు సమర్పించారు.